Yadu Vamshi : నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అంతా కొత్త వారితో రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. య‌దు వంశీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు దర్శకుడు యదు వంశీ మీడియాతో ముచ్చటించారు.

ఈ సినిమాలోని మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులను ఎంతగానో కదిలిస్తుందని దర్శకుడు యదు వంశీ తెలిపారు. “థియేటర్లో ఆ సీన్ చూస్తే కంట్లోంచి నీళ్లు వస్తాయి. అమ్మ సెంటిమెంట్‌ను ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించాను,” అని ఆయన అన్నారు. “మన ఊరు.. మన కుర్రోళ్లు.. మన ప్రేమ.. మన భావోద్వేగాలు.. అన్ని రకాల అంశాలతో ఉన్న ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తాం. థియేటర్లో చూడాల్సిన సినిమా. థియేటర్లో కూర్చుంటే నిజంగా జాతరలో ఉండి సినిమాను చూసినట్టుగా అనిపిస్తుంది. నిజంగానే కొంత మందికి పూనకాలు వచ్చాయి. ఈ మూవీని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది,” అని దర్శకుడు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Leave a comment

error: Content is protected !!