కరోనా వైరస్ కారణంగా విధించిన ఈ లాక్‌డౌన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ కి మరింత బూస్టింగ్ ఇచ్చి అమెజాన్, ఆహా లాంటి ఓటీటీ వేదికలకు కస్టమర్లను పెంచేసింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న జనం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో సినిమాలు చూడటం అలవాటుగా మార్చుకున్నారు. దీంతో ఫ్యూచర్‌లో కూడా వీటికే డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి.
ఈ క్రమంలోనే తెలుగు దర్శక నిర్మాతలు ఓటీటీ వైపు అడుగులేస్తున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని గ్రహించిన డైరెక్టర్ తేజ.. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌తో భారీ డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో మూడు వెబ్ సిరీస్‌లు, రెండు సినిమాలు నిర్మించేలా తేజ డీల్ కుదుర్చుకున్నాడని ఇన్‌సైడ్ టాక్. నేటితరం ప్రేక్షకులకు మరింత చేరువవుతూ ఇకపై డిజిటల్ రంగంలో రాణించాలని ఆయన ఫిక్స్ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం.