నారప్ప తర్వాత శ్రీకాంత్ అడ్డాల నుంచి వస్తున్న మూవీ పెదకాపు 1. విరాట్ కర్ణ అనే కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన మూవీ పెదకాపు. ఈ చిత్రం సెప్టెంబర్ 29 రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పాత్రికేయులతో ముచ్చటించారు.
పెదకాపు అనేది కమ్యూనిటీకి సంబంధించిన కథ కాదు. వాస్తవానికి ఈ చిత్రానికి కర్ణ అనే పేరు పెడదామనుకున్నాం. ఒక ఊరికి వెళ్లినపుడు బోర్డ్ మీద ఒక వ్యక్తి పేరు చూసాం. ఆ పేరు పక్కన బ్రాకెట్లో పెదకాపు అని రాసి ఉంది. అదేంటని అడిగితే పదిమందిని కాపాడేవాడు పెదకాపు అంటారు అని చెప్పారు. మన కథ ఇదే కదా అని పెద కాపు పేరు పెట్టామన్నారు శ్రీకాంత్ అడ్డాల.
ఈ చిత్రంలో వైలెన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుంది ఈ చిత్ర కథ ప్రాధాన్యతను బట్టి కొత్త హీరో అయితేనే బెటర్ అందుకే విరాట్ కర్ణను తీసుకున్నాం. ఈ చిత్ర బ్యాక్‌డ్రాప్ 1982 లో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. ఓ కొత్త పార్టీ వస్తున్నపుడు కొత్త మార్పులేవో చోటు చేసుకుంటాయి అనే భావన వస్తుంది. మా నాన్నగారు చాలా క్రియాశీలకంగా పనిచేసారు. నాటి పరిస్థితుల ఇన్స్పిరేషన్ గా ఈ చిత్ర కథ రాసుకున్నాను. ఒక విధంగా ఈ సినిమాకు మానాన్నగారే స్పూర్తి అన్నారు చిత్ర దర్శకుడు.
ఈ చిత్రంలో ఓ మళయాళీ యాక్టర్‌ని అనుకున్నాం. కానీ అతని డేట్స్ ప్రాబ్లమ్ వల్ల నాగబాబు, రావు రమేష్ లాంటి పెద్ద ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్స్ ప్రాబ్లమవుతుందని నేనే చేసానన్నారు శ్రీకాంత్ అడ్డాల.
ఇందులో తనికెళ్ళ భరణి గారి పాత్రతో పాటు అన్ని ప్రధాన పాత్రలకి నా వాయిస్ తో ఇంట్రో వీడియోలు చేసి విడుదల చేశాం. వాటికి కూడా మంచి స్పందన వచ్చింది. ఇందులో రావు రమేష్ గారు, అనసూయ గారి పాత్రలు కూడా చాలా బలంగా వుంటాయి.మిక్కీ జే మేయర్ చాలా అద్భుతంగా చేశారు.
కెమరామెన్ చోటా కె నాయుడు గారు మిగతా టెక్నిషియన్స్ నటీనటులు చాలా సహకరించారు. కథ దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుందని అన్నారు. అలా ఈ కథే కావాల్సిన అందరినీ సెలెక్ట్ చేసుకుంది. కథ అనుకున్నపుడే రెండు పార్ట్స్ చేద్దామనుకున్నాం.
నాకు ఫ్యామిలీ జోనర్ చేయడం చాలా ఇష్టం. సమాజంలో అత్యంత ముఖ్యమైన విషయం కుటుంబం. మనం కుటుంబం గురించే ఆలోచిస్తాం. అందులోని ఘర్షణలు, మానసిక యుద్ధాలు అందంగా ఆహ్లాదంగా చూపించడం నాకు చాలా ఇష్టం. వీటితో పాటు సమయానికి తగ్గట్టు మిగతా జోనర్స్ కథలు కూడా చేయాలని వుంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ లో చేయబోతున్నట్టు చెప్పారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.