ఎమోషనల్ గా మొద్దుబారుతున్న నేటి సమాజంలో ఇలాంటి సినిమాలు రావడం చాలా అవసరం అంటున్నారు హాయ్ నాన్న దర్శకుడుశౌర్యువ్.. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫస్ట్ ప్రొడక్షన్ గా వస్తున్న హాయ్ నాన్న తో శౌర్యు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నాని, మృణాల్ ఠాకూర్ , బేబీ కియారా ఖాన్ మెయిన్ లీడ్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 7 న పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో దర్శకుడుశౌర్యువ్ సినిమా గురించి ముచ్చటించారు.
ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చారు శౌర్యువ్. వైజాగ్‌లో తండ్రి రియల్ ఎస్టేట్ చేసేవారు. కుటుంబంలో అందరూ మెడిసిన్ చేయాలని చెప్పేవారు. అయితే శౌర్యువ్ మాత్రం సినిమా పట్ల ఆసక్తితో ఇండస్ట్రీకొచ్చానన్నారు. జాగ్వార్, అర్జున్ రెడ్డి, ఆదిత్య వర్మ రీమేక్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. హాయ్ నాన్న కథను 4 ఏళ్ల క్రితం రాసానన్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూసర్స్ కి చెప్పినపుడు చాలా ఎగ్జయిట్ అయి నానికి పరిచయం చేసారు. నానికి కథ విని వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారన్నారు. మృణాల్ చాలా స్వీట్ పర్సన్. కథ మీద నమ్మకంతోనే ఈ సినిమా చూసిన వారంతా ప్రేమలో పడిపోతారని మృణాల్ అంత నమ్మకంగా చెప్పారన్నారు. బేబీ కియారా ఖాన్ చాలా టాలెంటెడ్ బేబీ. సాధారణంగా చిన్న పిల్లలతో నటింపజేయడం చాలా కష్టంతో కూడిన పనే. అయితే బేబీ కియారా మాత్రం డైలాగ్ పేపర్ తీసుకుని వెంటనే సీన్ ని అందులో ఎమోషన్ ని అర్ధం చేసుకునేది. అలా నా వర్క్ చాలా ఈజీ అయ్యేలా చేసిందన్నారు దర్శకుడు శౌర్యువ్.
ఇందులో శ్రుతి హాసన్ గారికి పాత్రకు ఉండాల్సిన ప్రాధాన్యత వుంది. ఇప్పటివరకైతే ఆ పాత్ర గురించి ఇంత మాత్రమే చెప్పాలి. ఒకటి రెండు సర్ప్రైజ్ పాత్రలు వుంటాయన్నారు.
హాయ్ నాన్న’లాంటి కథ చేయడమే ఒక సవాల్. చాలా సున్నితమైన కథ. దానిని మాటలతో, సన్నివేశాలతో ఎమోషన్స్ తో నిలబెట్టాలి. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలి. ఇలాంటి కథను రాయడం ఒక సవాల్. ఇక చాలా మెమరబుల్ మూమెంట్స్ వున్నాయి. నాని గారు, మృణాల్, బేబీ కియరా తో ప్రతి సన్నివేశానికి ముందు ప్రిపేర్ అయ్యే విధానం చాలా మెమరబుల్ అనిపించిందన్నారు.
భవిష్యత్ లో కొన్ని కథలు వున్నాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత కొంత సమయం తీసుకొని ఆలోచిస్తాను. నా బలం ఎమోషన్. కమర్షియల్ సినిమాల్లో కూడా ఎమోషనే కీలకం అలాంటి సినిమాలే చేస్తానన్నారు దర్శకుడు శౌర్యువ్. .