వాళ్ల నాన్నకే సొంత బ్యానర్‌ ఉంది.. బయట వాళ్లకి సినిమాలు తీస్తాడా అనుకున్నారు.. అందుకే ఇంత గ్యాప్‌ వచ్చింది.. ఈ మాట అన్నది రూల్స్ రంజన్‌ డైరెక్టర్‌ రత్నం కృష్ణ. కిరణ్‌ అబ్బవరం, నేహాశెట్టి జంటగా స్టార్‌లైట్ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో అక్టోబర్‌ 6 న రిలీజ్‌ కాబోతోంది రూల్స్ రంజన్‌. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రత్నం కృష్ణ పాత్రికేయులతో ముచ్చటించారు.

నేను ఏ హీరోకి కథ చెప్పినా.. మీ సొంత బ్యానర్‌లో అయితే చేద్దామనేవారు.. ఆ టైమ్‌లో కుదరకపోయేవి.. నాన్నగారు తీస్తున్న సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా చూసుకోవడం వల్ల సినిమా తీయడానికి ఇంత గ్యాప్‌ వచ్చిందన్నారు రత్నం కృష్ణ. గతంలో ఆక్సిజన్ సినిమా ఇక్కడ సరిగా ఆడలేదు.. కానీ తమిళ్‌లో డబ్‌ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడి వారికి గోపీచంద్ ఇమేజ్‌ తెలియదు.. సినిమాని సినిమాగా చూడటం వల్ల బాగుందన్నారు. ఇక్కడ మాత్రం మిస్‌ ఫైర్‌ అయ్యిందన్నారు.

ఆక్సిజన్ సినిమా చూస్తుంటే కామెడీకి నవ్వుతున్నారు కానీ.. సీరియస్‌ సీన్స్‌కు ఆడియెన్స్‌ రెస్పాన్స్‌ ఏం లేదు.. అందుకే కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తీర్చిదిద్దాం అన్నారు రత్నం కృష్ణ.

జాతిరత్నాలతో నవీన్‌ పొలిశెట్టికి బిగ్‌ ఫ్యాన్‌ అయ్యా.. ఈ కథ ఆయనకు చెప్పాలనుకున్నా.. కుదరలేదు.. దాంతో కిరణ్‌ అబ్బవరం అయితే బాగుంటుందని ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడంతో అప్రోచ్‌ అయ్యాను. వేరే ప్రాజెక్ట్స్‌ ఉండటం వల్ల కుదరదని చెప్పాలనుకున్నారట కిరణ్ .. కానీ కథ నచ్చడంతో ఒప్పేసుకున్నారన్నారు.

ఈ సినిమా ఫ్రెండ్స్‌కి నాన్నగారికి, తమ్ముడు రవికృష్ణకి బాగా నచ్చింది.. చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నారన్నారు. 7/G బృందావన్‌ కాలనీ రీరిలీజ్‌ కి ఇంత రెస్పాన్స్‌ వస్తుందనుకోలేదు.. త్వరలో ఈ సినిమా సీక్వెల్ వచ్చే నెలలో స్టార్ట్‌ కాబోతుందన్నారు డైరెక్టర్‌ రత్నంకృష్ణ.

Leave a comment

error: Content is protected !!