అష్టాదశ శక్తి పీఠాల నేపథ్యంతో సాగే కథతో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్‌సిరీస్.. సర్వం శక్తిమయం. ఈ సిరీస్ దర్శకుడు ప్రదీప్ మద్దాలి. హిందూ మతంలోని విశిష్టతను అమ్మవారి శక్తిని తెలియజేస్తున్న ఈ సిరీస్ హిందీ వెర్షన్ జీ5, తెలుగు , తమిళ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అన్ని వర్గాల నుంచి విశేషమైన రెస్పాన్స్ వస్తున్న సందర్భంగా ఈ వెబ్ సిరీస్ దర్శకుడు ప్రదీప్ మద్దాలి.. తన అనుభవాలను, అంతరంగాన్ని మీడియాతో పంచుకున్నారు.
సహజంగా ఆర్ధడాక్స్ ఫ్యామిలీలో పుట్టినా .. ఆర్జీవి, పూరీ సహచర్యంతో నాస్తికుడిగా మారారట ప్రదీప్ మద్దాలి. అయితే సొంత ప్రయత్నాలు మొదలెట్టాక మాత్రం మళ్లీ తన మూలాలకు వెళ్లాననీ, ధ్యానం, క్రియ యోగ, సిద్ద యోగ వంటివి చేశాక.. వాటిలో ఉన్న శక్తి అర్ధమైంది. మనం చేస్తున్న పనికి తోడుగా శక్తి ఉండాలని తెలుసుకున్నాను.
సత్యదేవ్‌తో మొదటి సినిమా 47 డేస్ వంటి థ్రిల్లర్ తర్వాత పూర్తి అధ్యాత్మిక రూట్లో ఈ వెబ్‌సిరీస్ తీయడం సాహసమే.. ఈ సిరీస్ కు బివిఎస్ రవి క్రియేటివ్ హెడ్, హేమంత్ మధుకర్ ఈ కథ పై బాగా వర్క్ చేసారన్నారు ప్రదీప్ మద్దాలి.
అష్టాదశ శక్తి పీఠాల నేపథ్యంలో వెబ్‌సిరీస్ తీస్తున్నపుడు ఏ కొంచెం తేడా కొట్టినా విమర్శల పాలు కావాల్సివస్తుంది కానీ.. బివిఎస్ రవి, సిరాశ్రీ, నేను ఈ కథపై బాగా రీసెర్చ్ చేసి చాలా డెప్త్ తో వర్క్ చేసాం.. లాజికల్‌గా రీజనింగ్‌గా బాగా వచ్చిందన్నారు.
ఒరిస్సా నుంచి కాశ్మీర్ వరకు చేసుకున్న ప్లాన్ ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా చాలా తక్కువ టైమ్‌లోనే షూటింగ్ జరిగింది. ఓటీటీతో టైఅప్ కాకుండా ఖర్చుకు వెనకాడకుండా పూర్తి చేసి ఆ తర్వాత ఓటీటీకి వెళ్లడం.. అన్నీ సవ్యంగా కుదరడం మిరాకిల్ అనిపించిందన్నారు. దేశవ్యాప్తంగా రీచ్ కావాలనే ఉద్దేశ్యంతోనే హిందీ యాక్టర్స్‌ను ఎక్కువమందిని తీసుకున్నామనీ.. ప్రియమణితో సౌత్ బ్యాలెన్స్ చేసామన్నారు దర్శకుడు ప్రదీప్ మద్దాలి.
త్వరలో రామ్ తాళ్లూరి గా ఎన్ఆర్టీ బ్యానర్లో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు చెప్పారు దర్శకుడు ప్రదీప్ మద్దాలి.