Raviteja : మాస్ మహారాజా రవితేజ హీరోగా డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ చిత్రం “మిస్టర్ బచ్చన్” రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా, డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశారు.

మాస్ మహారాజ రవితేజ తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నప్పటికీ షూటింగ్ లో పాల్గొంటున్న ఫోటోను షేర్ చేశారు. రవితేజ డెడికేషన్ పట్ల హరీష్ శంకర్ ప్రశంసలు కురిపించాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “మిస్టర్ బచ్చన్” చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకులు, అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a comment

error: Content is protected !!