‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలతో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్‌ చేసిన హిట్ జోడి నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది.

ఈ సినిమాలో ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ నిడివి సుమారుగా 20 నిమిషాలు ఉంటుంది. ఈ ఏడు చాప్టర్లు పదేళ్ల వ్యవధిలో జరుగుతాయి. ఈ పదేళ్లలో 18 నుంచి 28 ఏళ్ళ వరకు నాగశౌర్య, మాళవిక పాత్రల ప్రయాణం ఉంటుంది. ఈ చిత్రం చాలా సహజంగా ఉండే సినిమా. పాత్రలు, సంభాషణలు కూడ అలాగే ఉంటాయి. ఈ కథ నిజ జీవితంలో దర్శకుడు చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా చిత్రీకరించడం జరిగింది.

ఈ చిత్రం టీజర్, సాంగ్స్, పోస్టర్స్ చూస్తే దర్శకుడు గత చిత్రాల కన్నా భిన్నంగా ఉన్నట్టు కనబడుతుంది. దాదాపు షెడ్యూల్ మొత్తం ‘యూకే’ లో షూటింగ్ పూర్తి చేసారు. యూకేలో షూటింగ్ లో టీమ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారంట కాకపోతే, నాగశౌర్య తన నటనతో దర్శకుడికి ఆ ఇబ్బందులను మర్చిపోయేలా చేసాడంట. నటుడిగా నాగశౌర్యలో చాలా తపన ఉంది.
ఇంకా చెప్పాలంటే సినిమా సినిమాకి డెడికేషన్ పెరుగుతూ వస్తుంది. అందుకే నాగశౌర్య అంటే నాకు చాలా ఇష్టం. అంతే కాదు, హీరోయిన్ మాళవిక ‘కథ’ విన్నాక ఎమోషనల్ గా స్పందించడంతో పాటు ‘కిస్ సీన్స్’ కి ఏ మాత్రం అభ్యంతరం చెప్పక పోవడంతో కాస్త రీలాక్స్ అయ్యాడంట దర్శకుడు.

అష్టాచమ్మా సినిమా నుంచి కళ్యాణ్ మాలిక్ గారితో దర్శకుడికి బాగా పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉండటంతో ఈ కాంబో లో వరుస పెట్టి హిట్స్ కొట్టారు. రీసెంట్ గా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాలోని ‘కనుల చాటు మేఘమా’ పాటను కీరవాణి గారి ప్రశంసించడంతో హ్యాట్రిక్ పక్కా అంటూ ఈ ఇద్దరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Leave a comment

error: Content is protected !!