ఆర్‌ఎక్స్‌ 100 తో పాయల్‌, అజయ్‌ భూపతి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో తెలిసిందే. కార్తికేయను మినహాయిస్తే.. ఈ ఇద్దరూ కలిసి మళ్లీ మంగళవారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్‌గా అల్లు అర్జున్‌ ఛీఫ్‌ గెస్ట్‌ గా ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. నవంబర్‌ 17 సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా దర్శకుడు అజయ్‌భూపతి పాత్రికేయులతో ఈ సినిమా విశేషాలు ముచ్చటించారు.

మంగళవారం కథ ఐడియా ఎప్పుడొచ్చిందో చెప్పలేను కానీ మహాసముద్రం సినిమా టైమ్‌లోనే మంగళవారం సినిమా తీయాలని ఫిక్స్‌ అయ్యాను. ఈ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను.. మా బ్రదర్ సురేష్‌ వర్మతో చెప్తే స్వాతిరెడ్డి గునుపాటి కి పరిచయం చేసారు. అందరం కలిసి ఈ సినిమా చేస్తున్నాంఅన్నారు అజయ్‌ భూపతి.

మంగళవారం టైటిల్‌ చూసాక పెద్ద వంశీ గారు ఫోన్‌ చేసి చాలామంచి టైటిల్‌ పెట్టావయ్యా.. ఈ టైటిల్‌తో సినిమా తీద్దామంటే నా ప్రొడ్యూసర్స్ ఒప్పుకోలేన్నారని అజయ్‌ భూపతికి చెప్పారట. మంగళవారం అంటే జయవారం.. ఒకప్పుడు మనకు మంగళవారం సెలవు ఉండేది బ్రిటిషర్స్‌ వచ్చి ఆదివారం సెలవు దినంగా ప్రకటించారన్నారు.

వాస్తవానికి మహాసముద్రం టైమ్‌లోనే అదితిరావు హైదరికి ఈ కథ చెప్తే ఎగ్జయిట్‌ అయ్యి చేద్దామన్నారు. కానీ నేనే కాంటాక్ట్ చేయలేదన్నారు అజయ్‌భూపతి. టీనేజ్‌ ఎండింగ్‌లో ఉన్న అమ్మాయితో ట్రై చేద్దామనుకున్నాం కానీ పాయల్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. మనం కలిసి చేద్దామని చెప్పడంతో రెండు రోజుల పాటు ఈ కథలో పాయల్‌ అయితే ఎలా ఉంటుందో విజువలైజ్ చేసుకున్నాక అప్పుడు ఓకే చెప్పానన్నారు. ఈ సినిమాలో విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో మా సినిమాటోగ్రాఫర్‌కి కూడా తెలియదు.. మ్యూజిక్‌ నెక్ట్స్‌లెవల్‌ లో ఉండబోతుందన్నారు. లాస్ట్ 45 మినిట్స్‌ ఆడియెన్స్‌ సూపర్బ్‌ థ్రిల్‌ అవుతారు. సౌండ్ నెక్ట్స్‌ లెవల్‌ ఉంటుందన్నారు.

ఆర్‌ఎక్స్‌ 100 కాంబో రిపీట్‌ చేద్దామని పాయల్‌ చెప్తే.. నేనే వద్దన్నాను.. కార్తికేయ హీరో పాయల్ విలన్‌గా ఆడియెన్స్‌ ఫిక్స్‌ అయ్యారు కాబట్టి ఆ ఫీల్‌ను నేను చెడగొట్టలేనన్నారు. ఈ కథను సంవత్సరం క్రితమే అల్లు అర్జున్‌కి చెప్పాను.. అందుకే టీజర్‌ చూసి సినిమా ఎలా ఉండబోతుందో బన్నీ చెప్పారు.. ఈ సినిమాలో న్యూడ్‌ సీన్ ఉందనుకుంటారుకానీ జీరో ఎక్స్‌పోజింగ్ ఉంటుంది.. ఈ సినిమాలో హర్రర్‌ ఫ్లేవర్ సౌండ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి కాబట్టి సెన్సార్‌ బోర్డ్‌ ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారన్నారు అజయ్‌ భూపతి.

Leave a comment

error: Content is protected !!