గత కొద్ది రోజులుగా .. ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ ఆయన నిన్న తన సొంతూరు నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలో వివాహం చేసుకున్నారు. మే 10వ తేదీ రాత్రి తన ఇష్టదైవమైన శ్రీవెంకటేశ్వర స్వామీ దేవాలయంలో అతికొద్దిమంది బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత.. అనారోగ్యంతో మరణించింది. ఈ ఘటన దిల్ రాజును తీవ్ర బాధను మిగిల్చింది. ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్నారు. తన తండ్రి ఒంటరిగా ఉంటున్న విషయం గమనించిన దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నాన్నకు ఎలాగైనా మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంది. తనకి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన తేజ అనే ఓ యువతిని దిల్ రాజు వివాహం చేసుకున్నారు. ఈమె గతంలో ఎయిర్ హోస్ట్రెస్‌గానూ పని చేసిందట. మొత్తానికి మాతృదినోత్సవం రోజున తన తండ్రి పెళ్ళి చేసి .. అనిత మరో మాతృమూర్తిని పొందడం విశేషం.