ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీస్‌ సీజన్‌ తో సంబందం లేకుండా ఆదరించబడతాయి. అలాంటి కథతో వస్తోంది దిల్‌సే. ఈ సినిమాని మంకల్ వీరేంద్ర, రవికుమార్‌ సబ్బాని లు శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అభినవ్ మదిశెట్టి , స్నేహ సింగ్ హీరో హీరోయిన్లు గా యూత్‌ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంతో శ్రీకర్‌ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్, పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 4 న రిలీజ్‌ కి సిద్దమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్‌ గా ప్రీరిలీజ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కౌశిక్‌ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ చిత్ర టీజర్ , ట్రైలర్‌, మేకింగ్ వీడియోస్‌ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా మంచి హిట్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. మంకల్ వీరేంద్రగారు మరిన్ని మంచి సినిమాలతో విజయాలందుకోవాలనీ, యాక్టర్స్‌కు మంచి గుర్తింపు రావాలని కాంక్షించారు. దిల్‌సే ఆగస్ట్‌ 4 న గ్రాండ్‌ గా రిలీజ్‌ కాబోతుంది.

Leave a comment

error: Content is protected !!