ధీరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, అమ్మగారి రామరాజు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం దిల్ రెడ్డి. ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో అంజన్ కస్తూరి, సాంచి బార్తి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి క్లాప్ నిచ్చారు. అలాగే, త్రినయని చిత్రంతో ప్రేక్షకులను అలరించిన భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చంద్రశేఖర్ మరియు వై.సి. ఈశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శక నిర్మాత అమ్మగారి రామరాజు, హీరో అంజన్ కస్తూరి, నటుడు భరద్వాజ్, హీరోయిన్ సాంచి బార్తి, సి దినకరన్ సినిమాకు సంబంధించిన పలు విశేషాల్ని తెలుపుతూ.. దిల్ రెడ్డి సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

Leave a comment

error: Content is protected !!