అక్కినేని నాగ చైతన్య మ్యాసివ్ బ్లాక్ బస్టర్ ‘దూత’ వెబ్ సిరిస్ తో చాలా గ్రాండ్ గా ఓటీటీ అరంగేట్రం చేశారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరిస్ కి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ వెబ్ సిరిస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ప్రసారమైన ‘దూత’ వెబ్ సిరిస్ యునానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో బిగ్గెస్ట్ ఓటీటీ హిట్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. ఈ నేపధ్యంలో నిర్మాత శరత్ మరార్ ‘దూత’ విశేషాలని విలేకరులతో పంచుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ ని జూన్ జులై లోనే పూర్తి చేసి ఫైనల్ కాపీ అమేజాన్ కి ఇచ్చాం. అయితే ఇచ్చిన తర్వాత ఎన్నో భాషల్లో డబ్, సబ్ టైటిల్స్ చేసి తర్వాత విడుదల చేస్తామని ముందే వివరించారు. ఆ ప్రక్రియకి దాదాపు ఐదు నెలలు సమయం తీసుకున్నారు. ఈ ప్రాసెస్ అంతా మాకు కొత్తగా అనిపించింది. అయితే విడుదలైన తర్వాత అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మంచి ప్రోడక్ట్ చేశామని తెలుసు. అయితే ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మాకు గొప్ప సంతోషాన్ని ఇచ్చింది.
దూత’ ఆలోచన, కాన్సప్ట్ చాలా నచ్చింది. విక్రమ్ కుమార్ గారు అద్భుతమైన కథకుడు. తను కథ చెబుతున్నపుడు ఆ ప్రపంచంలో మనల్ని హోల్డ్ చేస్తారు. ఆ కథతో పాటు మనల్ని తీసుకెళ్ళే సామర్ధ్యం ఆయనకి వుంది. దూత కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఉంటుందని ముందే తెలుసు. అయితే ఆలోచనని ఎనిమిది ఎపిసోడ్స్ గా ఎలా మలుస్తారనే క్యురియాసిటీ వుండేది. కొన్ని నెలలు తర్వాత ఎపిసోడ్స్ వారీగా కథ చెప్పారు. అద్భుతంగా అనిపించింది. తర్వాత అమెజాన్ వాళ్ళు పార్ట్నర్స్ గా వచ్చారు. విక్రమ్ కథ చెప్పినప్పుడే ఈ కథకు నాగచైతన్య లాంటి సెన్సిబిలిటీస్ వున్న లీడింగ్ యాక్టర్ అయితే బావుంటుందని అనుకున్నారు. అది మా అందరికీ కరెక్ట్ అనిపిచింది. ఈ సిరిస్ లో ప్రతి పాత్రకు సంబధించిన నటీనటులు ఎంపిక దర్శకుడు విక్రమే డిసైడ్ చేశారు.