మూవీ టైటిల్: సర్ 
నటి నటులు: ధనుష్, సంయుక్త మీనన్, సుమంత్, సముధ్రఖని, తణికెళ్లభరణి, సాయి కుమార్, హైపర్ ఆది, నిత్య శ్రీ, అరుణ్ తదితరులు…. 
మ్యూజిక్ డైరెక్టర్: జివి ప్రకాష్ కుమార్ 
సినిమాటోగ్రాఫర్: జె యువరాజ్ 
ఎడిటర్: నవీన్ నూలి 
ప్రేజెంటర్: శ్రీకారా స్టూడియోస్ 
బ్యానర్స్: సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ 
ప్రొడ్యూజర్స్: నాగ వంశీ – సాయి సౌజన్య 
రైటర్ & డైరెక్టర్: వెంకీ అట్లూరి 
తమిళ స్టార్‌ ధనుష్ ‌తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితుడు. కాకపోతే, తెలుగులో డబ్‌ అయి సూపర్ హిట్ సాధించాయి. ఈ సారి స్ట్రెయిట్ మూవీ ‘సర్‌’ అంటూ ఈ వారం థియేటర్ లోకి వచ్చేసాడు.  ఇప్పటికే రీలిజ్ అయ్యిన టీజర్‌, ట్రైలర్‌ పర్వాలేదు  అనిపించిన, ధనుష్ తెలుగు మూవీ ప్రమోషన్స్ లో పాటలు పాడి నెట్టింట వైరల్ గా నిలిచాడు. మరి, ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ లో నిలిచిందో లేదో రివ్యూలో చూద్దాం…!!
కథ: 
త్రిపాఠీ విద్యాసంస్థల చైర్మన్ “శ్రీనివాస్ త్రిపాఠీ”(సముద్రఖని). క్వాలిటీ ఎడ్యుకేషన్‌ పేరుతో భారీగా ఫీజులు వసూళ్లు చేస్తుంటాడు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడం వల్ల, ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది? ఆ అగ్రీమెంట్ ప్రకారంగా, త్రిపాఠి విద్యా సంస్థలో పనిచేసే జూనియర్‌ లెక్చరేర్ “బాలా గంగాధర్‌ తిలక్‌ అలియాస్‌ బాలు(ధనుష్‌)” ని కడప జిల్లా “సిరిపురం” ప్రభుత్వ కాలేజీకి పంపిస్తాడు. అక్కడ బాలు ఎదురుకొన్న సమస్యలు ఏంటి? త్రిపాఠి బాలు కి ఎందుకు వ్యతిరేకం అయ్యాడు? ఇందులో సాయి కుమార్, సంయుక్త మీనన్ పాత్ర ఏంటి? తెలుసుకోవాలంటే కాస్త కధనం, విశ్లేషణలోకి వెళ్దాం… 
కధనం, విశ్లేషణ: 
ముఖ్యంగా, మన దేశంలో జరిగే ఎడ్యుకేషన్‌ సిస్టమ్   సాగిస్తున్న అవినీతి పనులు, అరాచకాలు చూపించడంతో పాటు, మధ్య తరగతి కుటుంబాలు పడుతున్న అవస్థలు గురించి ఈ సినిమాలో క్లియర్ గా చూపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. సినిమాలో ఎక్కడ ల్యాగ్ లేకుండ పాయింట్ నేరుగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్. 
సినిమా ఓపినింగ్ లోనే అవినీతి కి పాలు బడ్డ శ్రీనివాస్ త్రిపాఠి(సముధ్రఖని) క్యారెక్టర్ పోట్రైట్ చేసిన విధానం బాగుంటుంది. హీరో ధనుష్ తో ఫెస్ టు ఫెస్ ఒక్క ఫైట్ సీక్వెన్స్ లేకపోయినప్పటికీ కేవలం డైలాగ్ డెలివెరి తో భయపెట్టిస్తాడు సముధ్రఖని. హీరో ధనుష్ ఎప్పటి లాగే తనదైన స్టైల్ లో పెర్ఫామెన్స్ అదరకొట్టాడు. స్టూడెంట్స్ కి ఏదన్న అయ్యితే తల్లి తండ్రులు కన్న మొదట గా కన్నీరు పెట్టుకునేది గురువు అని చాటి చెప్పేలా ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటుంది. హైపర్ ఆది కామెడీ, హీరోయిన్ సంయుక్త మీనన్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్లస్ పాయింట్. హీరో అండ్ హీరోయిన్ తో సాగే శీతాకాలం సాంగ్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా, కాలేజ్ లో ధనుష్ స్టూడెంట్స్ కి వేరు వేరు గా క్లాస్ లు చెప్పే సీన్ థియేటర్ లో రోమాలు నిక్క బొడుచుకుంటాయి. తల్లి తండ్రులు తమ పిల్లల భవిషత్తు కోసం పడే బాధలు, పాట్లు స్క్రీన్ మీద చూపించిన విధానం ప్రశంసనీయం. సర్ కి స్టూడెంట్స్ కి మధ్య సాగే ఎమోషనల్ జర్నీ సీక్వెన్స్, సత్తి అనే స్టూడెంట్ తో మధ్య జరిగే సీన్స్ హైలైట్. ప్రైవేట్ టీచర్లని వెలి వేయడం వల్ల పిల్లల భవిషత్తు ఆగిపోకూడదు అని,  ధనుష్ పొలంలో ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్తాడు. ఆ సంద్రభంలో జరిగే ఫైట్ సీక్వెన్స్ సినిమాకి ప్రధాన బలం. అదే విధంగా, ప్రెసిడెంట్ సాయి కుమార్ సిరిపురం గ్రామం నుంచి వెలివేసే సీన్స్ నెస్ట్ లెవెల్ అసలు. లక్ష్యం తో ముందుకెళ్తున్న ఒక సాధారణమైన టీచర్ ని ఆపడానికి విద్య ముసుగులో ఉండే రాజకీయ పురుగు ప్రయత్నం ఇంటర్వెల్ లో సక్సెస్ అవ్వుతుంది. 
ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ తరువాత, ధనుష్ సరి కొత్త ఐడియా తో ముందుకొచ్చి సిరిపురం స్టూడెంట్స్ కి మళ్ళి చదువు చెప్పడం కొనసాగిస్తాడు. అది తెలుసుకున్న శ్రీనివాస్ త్రిపాఠి(సముధ్రఖని) రాజకీయ బుద్ది కి పని చెప్తాడు. ఆల్మోస్ట్ హీరో ధనుష్ లక్ష్యం చతికలబడుతున్న టైం లో, మనం ఎంతగానో ఇష్టపడే డైరెక్టర్ భారతి రాజా గారు వచ్చి సహాయం చేయకపోతే స్టూడెంట్స్ పాస్ అయ్యేవారే కాదు? ఎక్జామ్ రాసే వారే కాదు? అసలు భారతి రాజా గారు ఎవరు? ఎందుకు వచ్చారు? ధనుష్ ఇంప్లిమెంట్ చేసిన ఆ ఐడియా ఏంటి? ఆ ఐడియా కి ఎవ్వరెవ్వరు సపోర్ట్ చేసారో తెలియాలి అంటే మీరు సినిమా చుడాలిసిందే? 
ఓవర్ ఆల్ గా సినిమా బాగుంది. ఇలాంటి సినిమా లు సగటు ప్రేక్షకుడు ఆదరిస్తాడు. ముఖ్యంగా, బి సి సెంటర్ లో ఈ సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు దండిగా ఉన్నాయి…!! సినిమాలో అక్కడక్కడ కాస్త లోపాలు ఉన్న పెద్దగా అనిపించవు..
నటి నటుల పెర్ఫామెన్స్: 
ధనుష్ కి ఇది మొదటి తెలుగు చిత్రమే కానీ, ఇంతక ముందే ప్యాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అరుదైన హీరో ధనుష్. సర్ సినిమాతో కేవలం తన ఎమోషన్స్ తోటి యావత్తు తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఫినామినల్ పెర్ఫామెన్స్. సంయుక్త మీనన్ ఒక బైయోలాజి లెక్చరేర్ గా చక్కటి ప్రద్రర్శనతో పెర్ఫామ్ చేసారు. సముధ్రఖని కార్పొరేట్ లెవెల్ లో విలనిజం, రాజకీయ బుద్ధి తో కథ ని ముందుకి కొనసాగించడంలో పోషించిన పాత్ర బాగుంటుంది. హీరో సుమంత్ క్యారెక్టర్ ఈ సినిమాలో మనం డిఫరెంట్ గా చూడచ్చు. సాయి కుమార్ & హైపర్ ఆది ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. యాక్టర్ అరుణ్, నిత్య శ్రీ & స్టూడెంట్స్ తమ పరిధి మేరకు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం: డైరెక్టర్ వెంకీ అట్లూరి ఎంచుకున్న పాయింట్, చూపించిన విధానం, ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసారు. మ్యూజిక్ అందించిన జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి ప్రధాన బలం. ఎక్కడ ఏ మాత్రం తీసిపోకుండా సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాడు. ఎడిటింగ్ లో అద్భుతమైన పని తీరు కనబర్చారు నవీన్ నూలి. డీఓపీ జె యువరాజ్ విజ్యువల్స్ చితకొట్టేసాడు, ఒక షాట్ లో హీరోయిన్ కళ్ళని ఎక్సట్రీమ్ క్లోజ్ లో పెట్టి ఎష్టాబ్లిష్ చేసిన విధానం కేక. సినిమాలో భారీ సెట్ లు ఆడంబరాలు లేకపోయిన, చూపించినంత వరుకు ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్. 
రేటింగ్: 4/5
బాటమ్ లైన్: తారా స్థాయిలో “సర్” విజృంభణ    
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

Leave a comment

error: Content is protected !!