Devisri Prasad : టాలీవుడ్ రాక్ స్టార్, క్రేజీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్‌పీ) తన 25 సంవత్సరాల సంగీత ప్రయాణాన్ని జరుపుకోవడానికి ఒక ఘనమైన సంగీత ప్రదర్శనతో హైదరాబాద్ నగరాన్ని ఊపేయడానికి రెడీ అవుతున్నాడు. అక్టోబర్ 19న అత్యంత ఘనంగా ఈ లైవ్ కాన్సెర్ట్ జరగబోతోంది.

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తన సంగీతంతో అందరిని మంత్రముగ్ధులను చేసిన డీఎస్‌పీ, ఈ లైవ్ షో ద్వారా తన అభిమానులకు మరింత దగ్గర కావాలని భావిస్తున్నారు. కళ్ళు మిలమిల మెరిసే లైటింగ్, అద్భుతమైన స్టేజ్ సెటప్, మరియు డీఎస్‌పీ స్వరకల్పనలతో ఈ షో ఒక అద్భుతమైన అనుభవంగా మిగిలిపోతుంది.

ఈ ప్రకటనతో సంగీత ప్రియులు పులకించిపోయారు. తెలుగు, తమిళ, హిందీ భాషా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి ఎన్నో విజయాలు సాధించిన డీఎస్‌పీ, తన అద్భుతమైన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Leave a comment

error: Content is protected !!