Devara : యంగ్ టైగర్ యన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న హైఓల్టేజ్ యాక్షన్ పాన్ ఇండియా మూవీ దేవర. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కు ఇదే తొలి తెలుగు సినిమా. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల కావాలి. అయితే కొన్ని కారణాల వల్ల సినిమాను అక్టోబర్ 10కి వాయిదా వేశారు. దాంతో ఆ సినిమా విడుదల కోసం ఆ తేదీ ఎప్పడొస్తుందా అని అభిమానులు తెగ వెయిట్ చేస్తూ వస్తున్నారు.

అయితే గత కొద్ది రోజులుగా దేవర విడుదల తేదీ గురించి మళ్లీ నాన్-స్టాప్ గా వార్తలు వస్తునే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ వాయిదా వేయడం వల్ల దేవర రిలీజ్ డేట్ మారుతుందని సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది. దానికి తగ్గట్టుగానే దేవర మేకర్స్ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన చేసారు.

“సెప్టెంబర్ 27 న దేవర మూవీ విడుదల కాబోతోందని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. అక్టోబర్ లో రిలీజ్ కావాల్సిన సినిమాను ఒక నెల ముందుకు ప్రీ పోన్ చేయడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!