Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “దేవర”. ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయికగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న “దేవర” తాజాగా గోవాలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది.

ఈ షెడ్యూల్‌లో తారక్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. వచ్చే వారాంతానికి ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. “దేవర” ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తారక్ రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!