Devara movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన లేటెస్ట్ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ట్రైలర్‌, సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇంక తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేశారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా కనిపించనున్నాడు. అజయ్‌, ప్రకాష్‌ రాజ్‌, పవిత్రా లోకేష్‌, శ్రీకాంత్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ రెండవ చిత్రంపై అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం భారీ బజ్‌ను సొంతం చేసుకుంది. జనతా గ్యారేజ్ చిత్రంలాగానే దేవర కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. మరి దేవర ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!