Devara movie : ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ “దేవర”. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ ఫ్యాన్స్ ను తెగ ఊరిస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతోంది. ఇటీవలే సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో ఈ చిత్రం భారీ ఎత్తున అమ్ముడయ్యింది.

ఆంధ్ర రూ. 55 కోట్లు, సీడెడ్ రూ.23 కోట్లు, నైజాం రూ.45 కోట్లు అని మొత్తం రూ.123 కోట్లకు అమ్ముడయ్యిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ ధరలు బట్టి చూస్తే “దేవర” ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రమని అర్ధమవుతోంది.

ఇటీవలే గోవాలోని అడవుల్లో ఓ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో పాల్గొ్న్న ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్ వెళ్ళారు. అక్కడ చిత్రీకరణలో పాల్గొననున్నారు ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ కు  మంచి స్పందన లభించింది. త్వరలోనే రెండో సింగిల్ కూడా విడుదల చేయనున్నారు. “దేవర” సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!