Shopping Cart 0 items - $0.00 0

60 ఏళ్ళ యన్టీఆర్ ‘దేవాంతకుడు’ చిత్రం

యమలోకాన్ని, యముణ్ని, చిత్రగుప్తున్ని .. పాపులకు వాళ్ళు వేసే శిక్షల గురించి .. తొలి సారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన  చిత్రం యన్టీఆర్ నటించిన ‘దేవాంతకుడు’. ఈ సినిమా తెలుగులో తెరకెక్కించిన మొట్టమొదటి సోషియో ఫాంటసీ చిత్రంగా చరిత్రకెక్కింది. 1960 లో విడుదలైన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని భలేగా థ్రిల్ చేసింది. నేటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సినిమా. సి.పుల్లయ్య స్వీయ దర్శకత్వంలో తెరెక్కిన ఈ సినిమాలో కథానాయికగా కృష్ణ కుమారి నటించగా.. యముడిగా యస్వీరంగారావు.. కె.రఘురామయ్య ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. లక్షాధికారి కుమార్తెను నాటకాల రాయుడు ప్రేమించి పెళ్ళాడగా తండ్రి ఆమెకు వేరే పెళ్ళి  చేయబోగా మరణిస్తుంది. పొరపాటున కథానాయకుణ్ణి కూడా యమభటులు యమలోకం తీసుకుపోగా యముడితో, ఇంద్రలోకంలో ఇంద్రునితో పోట్లాడి, శివపార్వతులను, శ్రీమహావిష్ణువును మెప్పిస్తాడు. ఇంతలో ఇదంతా కలగా తెలిసి భార్యను కాపాడుకుంటాడు. అశ్వథ్థామ సంగీతం అందించిన ఈ సినిమాలో గో..గో గోంగూర పాట అప్పట్లో చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత ఈ చిత్రం  స్ఫూర్తితోనే  తెలుగులో యమగోల, యముడికి మొగుడు, యమలీల, యమజాతకుడు, యమదొంగ, యమలీల మళ్లీ మొదలైంది.. లాంటి చిత్రాలు రూపొంది ప్రేక్షకుల్ని అలరించాయి.

.

Leave a comment

error: Content is protected !!