దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘నేచురల్ స్టార్ నాని’ పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ ఒకటి. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ‘సుధాకర్ చెరుకూరి’ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ హీరో ‘దీక్షిత్ శెట్టి’ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వుతున్నాయి. ఈ చిత్రం మార్చి 30న ఏకకాలంలో అన్ని భాషల్లో గ్రాండ్ గా విడుదలౌతుంది.

కన్నడ హీరో ‘దీక్షిత్ శెట్టి’, మీట్ క్యూట్ వెబ్ సిరిస్ తో టాలీవుడ్ లో తెరగేంట్రం చేసాడు. మీట్ క్యూట్ కి పని చేసిన కో డైరెక్టర్ ‘వినయ్’ ‘దసరా’ మూవీ టీంకి రిఫర్ చేయడంతో ‘సూరి’ గా కీలకమైన పాత్ర లో మన ముందుకు రానున్నారు. అంతేకాదు, హీరో ‘నాని’ మీట్ క్యూట్ లో ‘దీక్షిత్ శెట్టి’ పెర్ఫామెన్స్ చూసి అవకాశం ఇచ్చాడట. ‘నాని’ గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. చాలా సహజంగా పెర్ఫార్మ్ చేస్తారు. పది నిమిషాలు ముందే సెట్ లో వుంటారు. అంతటి క్రమశిక్షణ ఉండటం వల్లే ఆయన ఈ స్థాయిలో ఉన్నారు. పది నెలల పాటు ఆయనతో స్పెండ్ చేసే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తాను. అదే విధంగా, ‘కీర్తి సురేష్’ గారిని మహానటిలో చుశాను. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకుంటానని ఊహించలేదు. దసరా లో ఇద్దరితో కలసి పని చేయడం మంచి అనుభూతినించింది.

 

దర్శకుడు ‘శ్రీకాంత్ ఓదెల’ క్లారిటీ ఉన్న వ్యక్తి, ఆయన కోరుకున్నట్లు నా పాత్ర పైన ద్రుష్టి పెట్టాను. ముఖ్యంగా తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్, నడవడిక ఇలా చాలా విషయాలు నేర్చుకుంటు ఆ ప్రోసెస్ ని బాగా ఎంజాయ్ చేశాను. కన్నడ ప్రేక్షకులు ‘దసరా’ సినిమా కోసం ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నారు. నేను పుట్టి పెరిగిన ఊరులో రీలిజ్ అవ్వుతున్నందుకు నాకు చాలా హ్యాపీ గా ఉంది. కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్, తర్వాత భాషతో అడ్డంకులు లేవు. నేను నటించిన ‘దియా’ సినిమా తర్వాత థియేటర్ లో రిలీజ్ అవుతున్న సినిమా ‘దసరా’ కావడం చాలా ఆనందంగా వుంది. దసరా ఒక రోలర్ కోస్టర్ రైడ్ సినిమా. మంచి కంటెంట్ & అన్నీ ఎలిమెంట్స్ ఉన్న దసరా అద్భుతమైన విజయం సాధిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. సినిమా సక్సెస్ & ఫెయిల్యూర్స్ ఎప్పుడు మన చేతిలో ఉండదు, కాకపోతే సినిమా తరువాత సినిమా రావడమే పెద్ద సక్సెస్ గా భావిస్తాను అంటున్నాడు ఈ కుర్ర హీరో.

ఇప్పటికే, విడుదలైన సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి. దీనికి కారణం సంతోష్ నారాయణ్, దర్శకుడు శ్రీకాంత్. ఇద్దరు కలిసి ప్రతి సాంగ్ ని ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. దసరా ట్రైలర్ చూసాక ప్రొడ్యూజర్లు వచ్చి హీరో గా తదుపరి సినిమాలు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నారంట. కాకపోతే, చేసిన జోనర్ ని మళ్ళీ రిపీట్ చేయడం ఇష్టం వుండదట. ప్రతి సారి ఎదో కొత్తగా చేయాలి, ఎదో కొత్తగా నేర్చుకోవాలి అనే తపన నాలో ఉంది. నేను ఈ పాత్ర చేయగలని బలంగా నమ్మిన నిర్మాతలకు ఎప్పుడు రుణపడివుంటాను.

Leave a comment

error: Content is protected !!