ఈ మధ్య కాలంలో సీనియర్స్ కి మంచి టైమ్ నడుస్తున్నట్టుగా ఉంది. సీనియర్ హీరో నరేష్ నటుడిగా 50 ఏళ్లు పూర్తయ్యాక హీరోగా మళ్లీ పెళ్లి అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓ వెలుగు వెలిగిన రాజారవీంద్ర ఇప్పుడు మెయిన్ లీడ్ చేస్తూ ఓ సినిమా ప్రారంభమైంది. ఆ సినిమా వర్కింగ్ టైటిల్ గా డియర్ జిందగీ గా ఫిక్స్ చేసారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. ఓ అందమైన ఫ్యామిలీ డ్రామాలో అన్ని రకాల ఎమోషన్స్‌ను మిక్స్ చేస్తూ.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా అరుదైన కథనంతో డియర్ జిందగీ మూవీ రాబోతుందంటున్నారు. ఈ చిత్రంలో రాజా రవీంద్ర సరసన నీలప్రియా నటిస్తుంది. యశస్విని , శివచందు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర పూజాకార్యక్రమాల అనంతరం రాజా రవీంద్రపై సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ క్లాప్ ఇవ్వగా.. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కెమెరా స్విచ్చాన్ చేసి ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సాయిజా క్రియేషన్స్, మహా సినిమా బ్యానర్‌లు సంయుక్తంగా పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ప్రస్తుతం జరుగుతున్న సమాజంలోని తప్పు ఒప్పులను ఎత్తి చూపుతూనే ఎంటర్‌టైన్ చేసే చిత్రమిదని చెప్పారు రాజా రవీంద్ర.
పిలవగానే వచ్చి క్లాప్ ఇచ్చిన వివి వినాయక్ గారికి, కళ్యాణ్ కృష్ణ గార్లకు కృతజ్ఞతలు తెలియజేసారు నిర్మాతలు.
నటి యశస్విని మాట్లాడుతూ… ఈ చిత్రంలో అనుపమ అనే క్యారెక్టర్‌లో మిస్ ఇండియా కావాలని కలలు కనే అమ్మాయిగా నటిస్తున్నట్టు చెప్పారు.
సంవత్సరం పాటు కథ రాసి పక్కా స్క్రీన్ ప్లేతో చక్కని షాట్ డివిజన్ పూర్తయ్యాకే అందరికీ కథ నేరేట్ చేసానని.. ఈ క్రమంలో వెన్నుదన్నుగా నిలిచిన రాజా రవీంద్రకు కృతజ్ఞతలు తెలియజేసారు దర్శకుడు పద్మారావ్ అబ్బిశెట్టి. ఈ చిత్రాన్ని నిర్మించగలిగే సెన్సిబులిటీస్ ఉన్న నిర్మాతలకే కథ వినిపించానన్నారు. ఈ చిత్రానికి డియర్ జిందగీ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్టు చెప్పారు దర్శకుడు పద్మారావ్ అబ్బిశెట్టి.
నటి నీల ప్రియ..ఇందులో నేను శాంతి క్యారెక్టర్ లో మదర్ గా నటిస్తున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు.
కెమెరామెన్ సిద్ధార్థ స్వయంభు మాట్లాడుతూ .. ఇది ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ. ఇలాంటి మంచి సినిమాకు సినిమాటోగ్రఫీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.