Devara : తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సినిమాల్లో ‘దేవర’ ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ‘ఫియర్’ అండ్ ‘చుట్టమల్లె’ పాటలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ‘దావుడి’ అనే మరో అదిరిపోయే పాట విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోసారి ఎన్టీఆర్ తన డాన్స్ టాలెంట్ ఏంటో చూపించాడు. ఆ పాటలో మంచి మూమెంట్స్ ను ప్రదర్శించాడు .

‘దావుడి’ అంటూ సాగే ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాట ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరోసారి పెరిగాయి. ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్లు నటించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ‘దేవర’ సినిమా నుంచి విడుదలైన ప్రతి పాట హిట్ అవుతుండటం విశేషం. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమా యన్టీఆర్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అంచనా.

Leave a comment

error: Content is protected !!