డైనమిక్ ‘హీరో విశ్వక్ సేన్’ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జతగా రెండో సారి ‘నివేదా పేతురాజ్’ నటించింది. ‘విశ్వక్ సేన్’ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత బాధ్యతలు వహించారు. ఉగాది కానుకగా నిన్న(బుధవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. ‘విశ్వక్’ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. రీలిజ్ తరువాత, ‘ఆల్మోస్ట్ పడిపోయానే పిల్లా’ సాంగ్ కి మరింత ఆధరణ లభిస్తుంది. ఇప్పటికే, యూట్యూబ్ లో ఈ సాంగ్ 12మిలియన్స్ కి చేరువలో ఉంది.

సినిమా తీసున్నప్పుడు హీరో, దర్శకత్వం, నిర్మాణం ఇష్టం తోనే చేశాను. అయితే నిర్మాణం సమయంలో కన్నా, విడుదల సమయంలో కాస్త ఎక్కువ ఒత్తిడి వుంటుంది. పైగా, ‘ఫలక్ నామా దాస్’ కంటే పదింతలు ఖర్చు పెట్టాం. సేఫ్ బిజినెస్ చేయకుండ రిస్క్ చేసి రీలిజ్ చేసాం సో, మజా వస్తుంది అంటున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాలో ఒకటికి పదిసార్లు సీన్స్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చే దాకా తీర్చిదిద్దారట. అందుకే, ‘దాస్ కా ధమ్కీ’ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి దాదాపు 8 కోట్ల 88లక్షలు అని చెప్తున్నాడు. ఇకముందు, అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యితే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనున్నారు.

విశ్వక్ కి కామెడీ కన్న, యాక్షన్ డార్క్ డ్రామా ఇంటెన్స్ సినిమాలు బాగా డైరెక్ట్ చేస్తాడంట. ‘దాస్ కా ధమ్కీ’ సినిమాని కామెడీ ఎంటర్ టైనర్ గా రాసిన రైటర్ ప్రసన్న కథ నచ్చి కొన్నాడు విశ్వక్ సేన్. తన తెలివితేటలకు పదును చెప్పి, రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా మార్చాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాకి ‘రెండో’ పాత్ర బ్యాక్ స్టొరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది అంటున్నాడు. సో, పార్ట్ 2 లో కీలకంగా మారనుంది అనమాట. అయితే, ధమ్కీ సినిమాలో కామెడీ హిలేరియస్ వర్క్ అవుట్ అవ్వడం, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉందంటున్నాడు. ముఖ్యంగా, పేపర్ మీద కథ రాసినపుడు ‘నివేతా పేతురాజ్’ పాత్ర చాలా చక్కగా కుదిరింది. సినిమాలో చాలా బలమైన పాత్ర, అలాగే నివేతా కూడా బాగా ఫెర్ఫార్మ్ చేసింది. తెలివైన అమ్మాయి కాబట్టి, ఆ విషయం గ్రహించి నివేతా పేతురాజ్ సినిమా ఓప్పుకుంది.

ఈ మధ్య కాలంలో డ్యుయల్ రోల్స్ తగ్గుముఖం పట్టడం, దాస్ కా ధమ్కీ లో డ్యుయల్ రోల్ ప్రేక్షకులకి నచ్చడం చాలా హ్యాపీ గా ఉంది.
యాక్టర్ గా వరుస ఆఫర్ల తో దూసుకెళ్తున్న ఈ హీరో ప్రస్తుతం చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. సితార వంశీ గారి సినిమా, రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఓ సినిమా. ఈ రెండిటి తర్వాత సొంత ప్రొడక్షన్ లో మరో సినిమా వుంటుందట. ఒక పక్క ‘గామి’ విడుదలకు రెడీగా వుంది. అవి పూర్తయ్యాక ఫలక్ నామా దాస్ 2, ధమ్కీ 2 రెండూ దర్శకత్వం వహించే అవకాశం ఉంది అంటున్నాడు విశ్వక్ సేన్. అయితే ఈ రెండింట్లో ఏది ముందు వస్తుందో చెప్పలేను అంటూ నవ్వుతు సమాధానం ఇచ్చాడు.

ప్రస్తుత ధమ్కీ సినిమా మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్దమవ్వుతుంది. మేకర్స్ ఏప్రిల్ 14 న రీలిజ్ కి ప్ల్యాన్ చేయబోతున్నారు.

Leave a comment

error: Content is protected !!