Sarvanand 36 : శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ నటించిన ‘మనమే’ సినిమా జూన్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఇక శర్వా 36వ సినిమా ఇటీవల వార్తల్లో నిలిచింది. లూసర్ వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.

ఈ షెడ్యూల్‌లో శర్వానంద్, సీనియర్ నటుడు రాజశేఖర్, బ్రహ్మాజీలు పాల్గొన్నారు. మిగిలిన చిత్రీకరణ త్వరలోనే పూర్తి చేయనున్నారు. వచ్చే నెలలో మరో షెడ్యూల్‌ ప్రారంభమవుతుందని సమాచారం. మాళవికా నాయర్ శర్వానంద్ జోడీగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ నిర్మిస్తుండగా, గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!