Kalki 2898 AD : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ విడుదలకు మూడు రోజులు మాత్రమే ఉండగా, చిత్ర నిర్మాతలు సినిమాపై ఉత్కంఠను పెంచేందుకు ఎలాంటి అవకాశాన్నీ వదులుకోవడం లేదు. నేడు సోషల్ మీడియాలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆయన అశ్వత్థామ పాత్రలో కనిపించే కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. బిగ్ బీ ఆసక్తికరంగా, యుద్ధానికి సిద్ధంగా కనిపిస్తున్నారు.

సినిమా ట్రైలర్ మూడు రోజుల్లో విడుదలవుతుందని “ఆయన ఎదురుచూపులు ముగుస్తున్నాయి… ట్రైలర్‌కు 3 రోజులు మాత్రమే, జూన్ 10న విడుదల” అని కేప్షన్ కూడా వదిలారు. అదే సమయంలో, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రను మధ్యప్రదేశ్‌లోని నేమవర్, నర్మదా ఘాట్‌లో భారీ ప్రదర్శన ద్వారా ఆవిష్కరించారు. నేమవర్ నర్మదా ఘాట్‌ను ఈ సందర్భంగా ఎంపిక చేసుకోవడం చాలా ప్రాముఖ్యత ను సంతరించుకుంది.  అశ్వత్థామ ఇప్పటికీ నర్మదా నేలపై సంచరిస్తున్నాడని నమ్ముతారు. ఆయన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితర ముఖ్య పాత్రల్లో నటించిన ‘కల్కి 2898 ఎడి’ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, వైజయంతి మూవీస్ నిర్మించింది. భవిష్యత్తు నేపథ్యంలో సాహిత్య ప్రేరితమైన, బహుభాషా సైన్స్ ఫిక్షన్ అద్భుత కథా చిత్రం జూన్ 27, 2024న విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!