ఒక్కో హీరోకు ఒక్కో స్టైల్ వుంటుంది. కానీ ఏ హీరోకు సాధ్యం కాని స్టైల్, ఇమేజ్ రజినీకాంత్‌కు మాత్రమే సాధ్యమైంది. అసలు ఆయన క్రేజ్ గురించి ఎంత మాట్లాడుకున్నా
తక్కువే. అసలు విషయానికొస్తే.. రజినీకాంత్ లాంటి స్టార్ మూవీ భారీ బడ్జెట్‌తో తీసినపుడు ఏ రేంజ్లో ప్రమోషన్స్ చేయాలి ? ఎన్ని ఛానెల్స్‌కి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వుంటుంది.
ఒక్క ప్రమోషన్ వీడియో కోసం మూడు నెలల నుంచి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏమీ చేయలేదు.
ఈ ఇంట్రడక్షన్ అంతా కబాలీ మూవీ గురించి. ఈ మూవీకి అటు తమిళ్, ఇటు తెలుగులోనూ ఎలాంటి ప్రమోషన్స్ లేవు. ఈ సినిమాకు సంబంధించి ఎక్కడా రజినీకాంత్
ఇంటర్వ్యూ ఇవ్వలేదు. సాధారణంగా రజినీకాంత్ తన సినిమాలను ఎక్కువగా ప్రమోట్ చేసుకోడు. కానీ టీజర్, ట్రైలర్, ఆడియో ఫంక్షన్స్ లాంటివి మాత్రం షరా మామూలే.
అయితే కబాలీ విషయానికొచ్చేసరికి అలాంటివి కూడా లేవు. కేవలం టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ వదిలేసారు. ట్రైలర్ లేకుండా కేవలం టీజర్‌తో రిలీజ్ అయిన బడాస్టార్ మూవీ
కేవలం కబాలీనే. మరి ఈ ఫార్ములాను ఫాలో అయ్యే బడా హీరో ఎవరో చూడాలి.?