Tollywood : సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే వేణు స్వామి తాజాగా నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళల వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి. వేణు స్వామి వారి జాతకాలను విశ్లేషించి వారి విడాకులు తప్పవని అన్న వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారదను కలిసి వేణు స్వామిపై చర్యలు తీసుకోవాలని కోరాయి.

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద ఈ విషయంపై స్పందిస్తూ వేణు స్వామి మరియు ఈ వీడియోను ప్రసారం చేసిన యూట్యూబ్ చానళ్లపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేణు స్వామిని పిలిపించి ఆయన వివరణ అడుగుతామని తెలిపారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్షినారాయణ, జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు, ట్రైజరర్ సురేంద్ర కుమార్ నాయుడు, ప్రసాదం రఘు, లక్ష్మీతో పాటు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ నుండి ప్రెసిడెంట్ ప్రేమమాలిని వనం, సెక్రటరీ వేదుల మూర్తి, మెంబెర్స్ సువర్ణ, తేజస్విని సజ్జ, భాగ్యలక్ష్మి, యస్.కుమార్ మరియు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ వనజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

error: Content is protected !!