committee kurrollu : డబ్బుతో ఓట్లు కొంటారు. ఇది సరికాదు. ఓట్లు కొనుక్కొని ప్రజలకు మేలు చేయని రాజకీయ నాయకులను నమ్మవద్దని “కమిటీ  కుర్రోళ్ళు” అంటున్నారు. మనిషిలా ఆలోచించకుండా గొర్రెలా ఓటు వేయకండి.. అనే విషయాన్ని మాటల్లోనే కాకుండా … చక్కని పాట రూపంలో. అనుదీప్ దేవ్ కంపోజ్ చేయగా.. నాగ్ అర్జున్ రెడ్డి ‘గొర్రెలా’ పాటను రాశారు. అనుదీప్ దేవ్, వినాయక్, అఖిల్ చంద్ర, హర్షవర్ధన్ చావలి, ఆదిత్య భీమాటి, సింధుజా శ్రీనివాసన్, మనీషా పండ్రాంకి , అర్జున్ విజయ్ పాడారు.

ఈ పాటను జయప్రకాష్ నారాయణ విడుదల చేశారు. నిహారిక కొణిదెల సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పి మరియు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌లపై ‘కమీటీ కుర్రోళ్ళు’ సినిమా రూపొందింది. యదు వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, గోపరాజు రమణ, బలగం జయరామ్, శ్రీ లక్ష్మి, కంచెరపాలెం కిషోర్, కిట్టయ్య, రమణ భార్గవ్, జబర్దస్త్ సత్తిపండు తదితరులు ఇతర ముఖ్యాపాత్రల్లో నటించారు.

Leave a comment

error: Content is protected !!