ప్రముఖ హస్యనటుడు కడలి జయ సారధి ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 83.

సినిమారంగ ప్రస్థానం
సారధి1960లో సీతారామ కళ్యాణంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో నలకూబరునిగా నటించారు. అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. వీరు దాదాపు 372 తెలుగు సినిమాలలో నటించారు. తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నారు


నాటకరంగానికి సేవచేశారు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించారు.నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వెలువడిన సీతారామ కళ్యాణం సినిమాలో నలకూబరునిగా తొలిసారి చలనచిత్రంలో నటించారు.

Saradhi recent click in his house
Saradhi recent click in his house

.
వీరు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
సీతారామ కళ్యాణం (1961) – నలకూబరుడు
పరమానందయ్య శిష్యుల కథ (1966) – శిష్యుడు
ఈ కాలపు పిల్లలు (1976)
భక్త కన్నప్ప (1976)
అత్తవారిల్లు (1977)
అమరదీపం (1977)
ఇంద్రధనుస్సు (1978)
చిరంజీవి రాంబాబు
జగన్మోహిని (1978)
మన ఊరి పాండవులు (1978)
సొమ్మొకడిది సోకొకడిది (1978)
కోతల రాయుడు (1979)
గంధర్వ కన్య (1979)
దశ తిరిగింది (1979)
అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)
నాయకుడు – వినాయకుడు (1980)
మదన మంజరి (1980)
మామా అల్లుళ్ళ సవాల్ (1980)
బాబులుగాడి దెబ్బ (1984)
మెరుపు దాడి (1984) – అంజి
ఆస్తులు అంతస్తులు
శారద
అమరదీపం
ముత్యాల ముగ్గు
కృష్ణవేణి
శాంతి
చిత్రాల తో పాటు ఇంకా మరెన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు

Saradhi with his wife
Saradhi with his wife

అంతే కాదు సారధి గారు విజయవంతమైన చిత్రాల నిర్మాత కూడా! ధర్మాత్ముడు,అగ్గిరాజు,శ్రీరామచంద్రుడు చిత్రాలను నిర్మించారు. నవతా కృష్ణంరాజు గారు నిర్మించిన జమిందార్ గారి అమ్మాయి, పంతులమ్మ,అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓఇంటి భాగోతం చిత్రాల మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని సారధి గారే చూసారు.రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి తో ఉన్న సాన్నిహిత్యం తో గోపికృష్ణ బ్యానర్ లో నిర్మించిన చిత్రాలకు సారధి గారు సాంకేతికంగా చూసుకునేవారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలో సారధి గారు కీలక పాత్ర పోషించారు.

Leave a comment

error: Content is protected !!