‘కలర్స్’ స్వాతి… ‘కొంటె చూపుతో… నీ కొంటె చూపుతో…’ అంటూ తన చిలిపి చూపులతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. నటి కంటే ముందు తను మా టీవీలో ‘కలర్స్’ అనే కార్యక్రమం ద్వారా గల గల మాట్లాడుతూ… అల్లరల్లరి చేస్టలతో… సరదా సరదా సంభాషణలతో… బుల్లితెర యాంకర్ గా పరిచయమై తెలుగువారందరి ఇంటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. స్వాతి ఆ ప్రోగ్రామ్ తర్వాత ఆ పేరుకున్న ఫేమ్ తోనే సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ప్రవేశించి కేవలం తెలుగు సినిమాలే కాకుండా తమిళ్, మలయాళంలోనూ నటించింది. స్వాతి కేవలం యాంకర్ గానే కాకుండా తనకున్న టాలెంట్ తో డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత సింగర్‌గా, అటు పై హీరోయిన్ గా అవకాశాలను అందిపుచ్చుకుంది.
‘మహేష్… మహేష్…’ అంటూ ‘అష్టాచమ్మా’ సినిమాలో తను చేసిన సందడి అందరికీ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఆపై స్వాతి చేసిన సినిమాలలో ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ వంటి సక్సెస్ఫుల్ సినిమాలలో నటించింది. అయితే తర్వాత చేసిన ‘త్రిపుర’ వంటి కొన్ని సిననిమాలు అంతగా అలరించకపోవడంతో… ఈమె తన చిన్ననాటి స్నేహితుడైన పైలెట్ వికాస్ ని వివాహం చేసుకుని విదేశాల్లో సెటిల్ అయింది.
కలర్స్’ స్వాతి అనగానే గుర్తొచ్చే తెలుగు సినిమాలు :
డేంజర్, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, అనంతపురం(సుబ్రమణ్య పురం) , అష్టా చెమ్మ, కలవరమాయే మదిలో, మిరపకాయ్, స్వామిరారా, కార్తికేయ. పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాలో ఇలియానాకు డబ్బింగ్ చెప్పింది కలర్స్ స్వాతినే. ‘100% లవ్’ సినిమాలో ఏ స్క్వేర్ బి స్క్వేర్ సాంగ్ తో సింగర్ గాను ఆకట్టుకుంది. ‘కలర్స్’ స్వాతి పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ అందిస్తుంది మూవీ వాల్యూం.