సాధారణంగా ఒక పాటకి యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రావాలంటే అంత ఈజీ కాదు. స్టార్ హీరోలు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్ సినిమా పాటలకే ఈ మధ్య కాలం లో పెద్దగా వ్యూస్ రావడం లేదు. కానీ అలాంటిది ఎటువంటి పరిచయాలు లేని సాధారణ పాటకి మిలియన్ వ్యూస్ రావడం అనేది చాలా అరుదు. అలాంటి అరుదైన రికార్డ్ సాధించిన పాటే ‘చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయే’. జనవరి 12న యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ పాటకు నెటిజన్ల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే ఈ పాటను 28,362,801 మంది వీక్షించగా త్వరలో 30 మిలియన్ వ్యూస్ కి చేరువ అయ్యే దిశగా సాగుతుంది. దీప్తి సునయన, సుమంత్ ప్రభాస్ పై చిత్రీకరించారు డి.ఓ.పి మరియు డైరెక్టర్ వినయ్ షన్ముఖ్, లిరిక్స్ సుమంత్ బానిసెట్టి , ప్రొడ్యూసర్ లావణ్య . మేల్ & ఫీమేల్ సింగర్స్ గా విజయ్ బుల్గానిన్, మేఘన ఆలపించారు. పాట పాడటమే కాకుండా ఈ పాటకి మ్యూజిక్ ని కూడా అందించారు విజయ్ బుల్గానిన్.
‘చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయే’ లిరిక్స్ :
మేల్ వాయిస్ :
అలా చూశానో లేదో ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే
అలా చూశానో లేదో ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే
నా మనసే మాటే వినదే
నీ వెనుకే ఉరికే ఉరికే
నీ మదినే జతగా అడిగే
కాదనకే కునుకే పడదే పడదే.. ప..డ..దే…
ఓ క్షణం నవ్వునే విసురు
ఓ క్షణం చూపుతో కసూరు
ఓ క్షణం మైకమై ముసురు
ఓ క్షణం తీయవే ఉసురు
చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయే
నిన్నెలా చెరడం చెప్పవా…ఆ
నాలో ప్రేమంత నేనే మోయ్యాల
కొద్దిగా సాయమె చెయ్యవా…ఆ
ఇంకెంతసేపంట నీ మౌన భాష
కరుణించవే కాస్త త్వరగా…ఆ
నువ్వు లేని నన్ను నేను ఏం చేసుకుంటా
వదిలేయకే నన్ను విడిగా…
హూ…హూ.. హూ…
ఓ క్షణం ప్రేమగా పిలుపు
ఓ క్షణం గుండెనే తెరువు
ఓ క్షణం ఇవ్వవ చనువు
ఓ క్షణం తోడుగా నడువు
ఫీమేల్ వాయిస్ :
అలా చూశానో లేదో ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే
అలా చూశానో లేదో ఇలా పడ్డానే
నువ్వెం చేశావో ఏమో
నువ్వే చెప్పాలే
నాలోకం నాదే ఎప్పుడు
ఈ మైకం కమ్మే వరకూ…ఉ
ఏ కలనే కనలేదెప్పుడు
ఈ కలలే పొంగేవరకూ…ఉ
కలలే… కలలే…
మనసుకే మనసుకే ముందే
రాసి పెట్టేసినట్టుందే
అందుకే కాలమే నిన్నే
జంటగా పంపినట్టుందే