నావల్ కరోనా వైరస్ కోవిడ్ 19 ప్రస్తుతం ప్రపంచం అంతటికీ శత్రువు. ఇప్పటికే ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న ఈ మహమ్మారిని అడ్డుకోవాలంటే.. లాక్ డౌన్ ఒక్కటే పరిష్కార మార్గం.  బైటికి రాకుండా ఎవరింట్లో వారుండడమే అన్నటికన్నా ఉత్తమమైన మార్గం. అందులో భాగంగా  కరోనాపై  పోరాటానికి సూచకంగా కొవ్వొత్తులు, దీపాలతో సంఘీభావం ప్రకటించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా మంచి స్పందన కనిపించింది. మనమంతా ఒక్కటే అనే భావన కల్పించడానికి చేసిన ప్రయత్నానికి తెలుగు సినీ పరిశ్రమ అద్భుతంగా స్పందించింది.

ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత భారీ సంఖ్యలతో దీపాలు వెలిగించి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్స్ దీపాలు వెలిగించి మరో దీపావళిని తలపించారు. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి దీపాలను వెలిగించి కరోనాపై పోరాటం చేస్తున్న ప్రతీ ఒక్కరికి మానసిక స్థైర్యాన్ని అందించారు. ప్రధాని ప్రకటన వచ్చినప్పటి నుంచి చిరంజీవి పలు వీడియోలను రిలీజ్ చేసి ప్రజలను మానసికంగా సంసిద్ధం చేశారు.

Leave a comment

error: Content is protected !!