మెగాస్టార్ చిరంజీవి అనూహ్య నిర్ణయం తీసుకోవడం అభిమానులను భలేగా ఖుషీ చేస్తోంది. అదేంటంటే.. ఈ ఉగాది నుంచి ఆయన సోషల్ మీడియాలో అకౌంట్ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ హౌస్ కు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ నుంచి తెలిపారు. ఇక నుంచి తన మనసులోని భావాల్ని,సందేశాల్ని డైరెక్ట్ గా అభిమానులతో పంచుకోవాలనే నిర్ణయంతో చిరు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ట

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా లో నటిస్తున్నారు. కరోనా ఔట్ బ్రేక్ వల్ల షూటింగ్ కు బ్రేకిచ్చిన ఆయన.. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన తాజా చిత్రాల విశేషాల్ని అందించడానికి  అభిమానులతో ఎప్పటికప్పుడు తన భావాల్ని పంచుకోవడానికి ట్విట్టర్ అకౌంట్ ను వాడబోతున్నారని తెలుస్తోంది. మరి మెగా స్టార్ అకౌంట్ ను  ఎంత మంది ఫాలో అవుతారో చూడాలి.

Leave a comment

error: Content is protected !!