టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎవెయిటెడ్‌ మూవీ భోళా శంకర్‌. మెగాస్టార్‌ నుంచి వస్తున్న వరుస సినిమాల్లో భోళా శంకర్‌ ప్రత్యేకమైన మూవీ. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా.. ఆగస్ట్‌ 11 న రిలీజ్‌ కాబోతుంది. మెహర్‌ రమేష్ డైరెక్షన్ చేసిన భోళాశంకర్‌ మూవీ నిర్మాత అనిల్‌కుమార్ సుంకర ప్రమోషన్స్‌ లో భాగంగా పాత్రికేయులతో ముచ్చటించారు.
మెగాస్టార్‌ తో సినిమా చేయడం ఎవరికైనా ఓ డ్రీమ్. ఆ డ్రీమ్‌ ఇంత త్వరగా భోళాశంకర్‌తో తీరుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నారు అనిల్‌ సుంకర. తాను సినిమా ప్రొడక్షన్‌ స్టార్ట్ చేసే నాటికి మెగాస్టార్‌ చిరు రాజకీయాల్లో ఉండటంతో సినిమా ప్రొడ్యూస్ చేసే అవకాశం వస్తుందనుకోలేదన్నారు. కానీ భోళాశంకర్‌తో ఆ కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఛీఫ్‌ గెస్ట్‌ గా చిరు గారిని పిలవడానికి వెళ్లినపుడే చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఎప్పటి నుంచో కలవాలనుకున్నాను ఫైనల్‌గా ఇప్పుడు కలిసామండీ అని చెప్తే.. కలవడం ఏంటి సినిమానే చేయబోతున్నాం అన్నారు. హ్యాపీగా ఫీలయ్యానన్నారు అనిల్‌ సుంకర. వేదాళం కన్నడ రీమేక్‌ రైట్స్ మా దగ్గర ఉన్నాయి. అక్కడ ఓ సూపర్‌స్టార్‌తో చేద్దామనుకున్నాను. కానీ మెగాస్టార్‌ ఓకే చెప్పడంతో అది పోస్ట్ పోన్ చేసి భోళాశంకర్ స్టార్ట్ చేసామన్నారు.
ఒక్కోసారి బడ్జెట్ కంట్రోల్‌ తప్పుతుంటుంది. ఇది అన్ని సినిమాలకు జరిగేదే. ఒక్కసారి మెగాస్టార్‌ దృష్టికి తీసుకెళ్తే.. ఎలా కంట్రోల్ చేయాలా అనే విషయంలో ఆయన అనుభవం మాకు బాగా కలిసొచ్చిందన్నారు. చిరంజీవి గారు మాతో సరదాగా మాట్లాడుతూనే ఉంటారు.. వాళ్లు రాకముందే షాట్ రెడీ అయ్యిందని తెలుసుకుని వెళ్తారు.. ఎప్పుడు గమనించారా అని ఆశ్చర్య పోవాల్సి వచ్చిందన్నారు.
వాస్తవానికి ఈ సినిమా ఎఎం రత్నం గారు చేద్దామనుకున్నారు. కానీ రత్నంగారు మాకు చాలా క్లోజ్‌కావడంతో మా ప్రొడక్షన్‌లో వర్కవుట్‌ అయ్యింది. నా లైఫ్‌లో ఒకరి దగ్గరికెళ్లి సినిమా ఓకే చేయించడం ఒక్క కీర్తి సురేష్ గారి విషయంలోనే జరిగింది. చిరంజీవి, కీర్తిసురేష్‌ ల బ్రదర్‌ సిస్టర్‌ బాండింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్రకు కీర్తిసురేష్‌ పర్‌ఫెక్ట్‌ ఆప్షన్‌. ఈ మూవీ షూటింగ్ ప్రాసెస్‌లో దాదాపు 40 రోజుల పాటు చిరుతో జర్నీ చేసాం. మహేష్ బాబు షూటింగ్‌ తప్ప ఏ హీరో షూట్‌ లోనూ ఉండను.. మహేష్‌ గారే చెప్పారు.. చిరు తో షూట్‌ లో ఉంటే చాలా ఆనందపడతారన్నారు. అలా 40 రోజుల పాటు సెట్‌లో ఉన్నాను. ప్రతీరోజూ ఓ కొత్త విషయం నేర్చుకున్నానన్నారు.

Leave a comment

error: Content is protected !!