మెగాస్టార్ చిరంజీవికి మాస్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో ‘జ్వాల’ ఒకటి. పీయన్.ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1985లో విడుదలైంది. సరిగ్గా 35 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించిది. అన్నదమ్ములుగా చిరంజీవి  ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా.. రివెంజ్ స్టోరీగా తెరకెక్కింది. తన తండ్రిని చంపినవాళ్ళపై పగతీర్చుకొనే పాత్రలోనూ, ఇన్స్పెక్టర్ గానూ చిరంజీవి అభినయం అద్భుతం. భానుప్రియ, రాధిక కథానాయికలు గా నటించగా.. కైకాల సత్యనారాయణ, అన్నపూర్ణ, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీత సారధ్యంలోని పాటలు ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి. కలికి చిలక , ఎవేవో కలలు కన్నాను, ఎన్నెల ఎన్నెల లాంటి పాటలు జ్వాల చిత్రానికి హైలైట్స్ గా నిలిచిపోయాయి. రవిరాజా పినిశెట్టికి దర్శకుడిగా ఇది రెండో చిత్రం అవడం విశేషం. అప్పట్లో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. 

Leave a comment

error: Content is protected !!