ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ‘లూసిఫర్’ మలయాళ రీమేక్ మూవీ సుజిత్ దర్వకత్వంలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమా ప్రారంభం కానుందని సమాచారం. నిజానికి ఈ కాంబో మూవీ ఎప్పటి నుంచో ప్లానింగ్ లో ఉంది. గతంలో కూడా  పలు ఇంటర్వ్యూల్లో త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఉందని చిరంజీవి పేర్కొన్నారు. అన్నట్లుగానే ఇటీవల త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైన్ కు చిరంజీవి ఓకే చెప్పారట.

తాజా సమాచారం ప్రకారం చిరంజీవి త్రివిక్రమ్ ల కాంబో మూవీ వచ్చే ఏడాది లేదా ఆ తర్వాత ఏడాది అయినా ఖచ్చితంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. త్రివిక్రమ్ తన తదుపరి చిత్రంను ఎన్టీఆర్ తో చేసేందుకు ఇప్పటికే సిద్దం అయ్యాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే ఎన్టీఆర్ తో సినిమాను త్రివిక్రమ్ మొదలు పెట్టబోతున్నాడు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ కూడా ఉంటుందని అంటున్నారు. కాని చరణ్ కంటే ముందు చిరంజీవి త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేస్తాడని మెగా కాంపౌండ్ లో టాక్ వినిపిస్తుంది. చంటబ్బాయ్ లోని చిరంజీవి పాత్ర తరహాలోనే ..ఇందులోనూ చిరుపై ఔట్ అండ్ ఔట్ కామెడీని త్రివిక్రమ్ వర్కవుట్ చేయబోతున్నాడట. మరి ఈ క్రేజీ కాంబో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

 

 

Leave a comment

error: Content is protected !!