తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు భేటీ అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్ లు మొదలవ్వాలని, లేకపోతే చాలా మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖులు కేసీఆర్ ను కోరారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ లో కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి పరిశ్రమలోని యావన్మంది తరుపున కృతఙ్ఞతలు. ఈ రోజు వారు సినిమా, టీవీ, డిజిటల్ మీడియా కి సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.. అని చిరంజీవి ట్వీట్ చేశారు. వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందించి, అందరికి మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చారని చిరంజీవి తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, టీవీ పరిశ్రమ తరపున తాను కేసీఆర్ కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
వేలాది మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువుని దృష్టిలో ఉంచుకుని సినిమా,టీవీ షూటింగ్స్ కి అనుమతి మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి,విధి విధానాలు రూపొందించి సహకరించిన శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, ప్రభుత్వాధికారులకు కృతజ్ఞతలు.Thank You Sir.@TelanganaCMO
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2020