“ధక్ ధక్ కర్నే లగా”  బేట మూవీ లోని ఈ పాట అప్పట్లో అత్యంత పెద్ద హిట్. ఎంత హిట్టంటే ఈ పాట కోసం ఈ సినిమా కి వెళ్ళిన వాళ్ళు కూడ ఉన్నారు. ఈ పాటలో మాధురి ఎక్స్ ప్రెషన్స్ హైలెట్. అన్నట్టు ఈ పాట ఇళయరాజా మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన చిరంజీవి, శ్రీదేవి జగదేకవీరుడు అతిలోకసుందరి లోని ” అబ్బనీ తీయని దెబ్బ ” పాట కి కాపీ. ఈ పాట ఈ సినిమా కే పెద్ద హైలెట్. ఈ పాట లో చిరంజీవి, శ్రీదేవి స్టెప్స్ , పాట పిక్చరైజేషన్ వేటికి అవే సాటి గా నిలిచాయి. ఐతే ఈ పాటకి సుందరం మాస్టర్ అందుబాటులో లేకపోవడం తో ప్రభుదేవా ఈ పాటకి కొరియోగ్రాప్ చేసే అవకాశం వచ్చింది. ఇలా అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు ప్రభుదేవా. . ఐతే ఈ రెండు పాటలు ఈ సినిమాలు రిలీజైన టైంలో ఓ ఊపు ఊపాయి. ఇద్దరు హీరోలకి , హీరోయిన్స్ కి ఈ పాట వాళ్ల కెరీర్ లోనే బెస్ట్ హిట్. 

Leave a comment

error: Content is protected !!