150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన దర్శకరత్న దాసరి నారాయణ రావు జయంతి సందర్బంగా యావత్తు తెలుగు సినీపరిశ్రమ దాసరిని స్మరించుకకుంటూ ఆయనపై గల అభిమానాన్ని గౌరవాన్ని చాటుకుంటుంది. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి దాసరిని స్మరించుకుంటూ ఓ ట్వీట్ చేశారు. దాసరిని ప్రస్తావిస్తూ కేవలం అగ్ర హీరోలతోనే కాదు… కొత్త నటీనటులతోనూ విజయవంతమైన సినిమాలు చేసి టాలీవుడ్‌లో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దాసరికి కేంద్ర ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వకపోవడం తీరని లోటని చిరంజీవి ట్వీట్‌లో తెలిపారు. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా, నాయకుడిగా భిన్నమైన పాత్రలు పోషించిన బహుముఖ ప్రజ్ఞాశాలైన దాసరిని ప్రభుత్వం గుర్తించక పోవడంపై చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మార్గదర్శకమేనన్నారు చిరంజీవి. ఈ సందర్భంగా దాసరికి పోస్త్ మస్ గా అయినా విశిష్టమైన పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు సినీపరిశ్రమకు దక్కే గౌరవం అవుతుందని చిరంజీవి తన ట్వీట్‌లో వెల్లడించారు.
చిరంజీవి ట్వీట్
#RememberingALegend #DrDasari #PadmaForDrDasari pic.twitter.com/pasn1g2YWr
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2021