chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, బింబిసార ఫేమ్ వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మరో సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. లేటెస్ట్ గా విశ్వంభర డబ్బింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమాలో హై స్టాండర్డ్ క్వాలిటీతో విజవల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి. ఇంక .. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో క్వాలిటీ రావడం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

త్రిష, ఆషికా రంగనాథ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. కునాల్‌ కపూర్‌ విలన్ గా నటిస్తున్నాడు. యు.వి. క్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ సినిమా మ్యూజిక్‌ కంపోజింగ్ ప్రక్రియ తన ఇంట్లోనే జరిగిందంటూ, అందుకు సంబంధించిన వీడియోని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు చిరంజీవి. గురువారం సంగీత దర్శకుడు కీరవాణి పుట్టినరోజు సందర్భంగా ఆ వీడియోని విడుదల చేస్తూ, ‘ఆపద్బాంధవుడు’ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

‘ఒకప్పుడు అందరం ఒక చోట చేరి, సంగీత దర్శకుడి ఊహల్లో ప్రవహిస్తున్న బాణీలు బాగున్నాయో లేవో చర్చించుకునేవాళ్లం. ఆ తర్వాతే పాట బయటికొచ్చేది. మరుగున పడిన ఆ ఆనవాయితీని గుర్తు చేస్తూ… మళ్లీ మా కీరవాణి ‘విశ్వంభర’ కోసం పాటల్ని కంపోజ్‌ చేసే ప్రక్రియ మా ఇంట్లో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మా పాత రోజులు గుర్తొచ్చాయి. ‘ఆపద్బాంధవుడు’ సంగీతం కంపోజ్‌ చేసే సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ నాటి ఆ మధుర గీతాన్ని ఆయన ఆలపిస్తుంటే మనసు తీయని అనుభూతికి లోనైంది’’ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు చిరంజీవి. ఈ వీడియోలో ‘ఆపద్బాంధవుడు’లోని ‘చుక్కల్లారా…’ పాటని కీరవాణి ఆలపించారు.

Leave a comment

error: Content is protected !!