గిన్నిస్‌ బుక్‌ రికార్డ్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.. అద్భుతమైన ప్రతిభా పాటవాలుండాలి. ఆ రికార్డ్ సాధించిన రోజు ఎంత ఆనందం కలిగిందో.. చిరంజీవిగారు ఆప్యాయంగా పిలిచి సత్కరించిన రోజు కూడా అంతే ఆనందం కలిగింది. ఈ మాట అన్నది మరెవ్వరో కాదు.. గిన్నిస్‌ బుక్‌ రికార్డ్ సాధించిన తెలుగు సంగీత దర్శకుడు స్వర వీణాపాణి. 72 మేళకర్త రాగాలను మేళవించి 64 గంటల పాటు మ్యూజిక్‌ చేస్తూ గిన్నిస్‌ బుక్ రికార్డ్ సాధించారు. ఇదంతా ఏడాది క్రితం జరిగింది. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్‌, తనికెళ్ల భరణి లు స్వరవీణాపాణిని సత్కరించారు. ఓ తెలుగు వాడు ఇంత ఉన్నతమైన రికార్డ్‌ను సాధించడం పట్ల మెగాస్టార్‌ చిరు ఘనంగా సత్కరించారు. గిన్నిస్‌బుక్‌ రికార్డ్‌ సాధించడం ఎంత గర్వంగా ఉందో… చిరు గారి ఆత్మీయ సత్కారం అంతటి ఘనమైన ఆనందాన్ని కలిగించిందన్నారు స్వరవీణాపాణి. ఇన్నాళ్ల తర్వాత ప్రస్తుతం మ్యూజిషియన్‌ స్వరవీణాపాణి నాలుగు నెలలపాటు అమెరికా , లండన్‌లలో అనేక కచేరీలు చేయబోతున్నారు.


ఎంతోమంది రసహృదయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వారందరిని మీ సంగీతంతో తన్మయత్వం చెందేలా చేయమని చిరు సలహా ఇచ్చారు. ఏ ముహుర్తాన ఆయన అలా అన్నారో ఈ రోజున చిరంజీవిగారి మాట నిజమైంది. అమెరికా,లండన్లలో దాదాపు 45 చోట్ల నేను నా సంగీతంతో శ్రోతలను అలరించటానికి వెళుతున్నాను. నన్ను గతంలో ప్రోత్సహించిన చిరంజీవిగారికి, ఇప్పుడు 4నెలల టూర్‌ను ప్లాన్‌ చేసి నాకు సహకరిస్తున్న సంస్థలకు వ్యక్తులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’అన్నారు స్వరవీణాపాణి.

Leave a comment

error: Content is protected !!