ప్రస్తుతం ప్రపంచం కరోనా కోరల్లో చిక్కుకుంది. దాని ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. లాక్ డౌన్ విధించాయి. దాదాపు 60రోజులుగా అన్ని రంగాలూ నష్టాల్ని చవిచూశాయి. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ షూటింగ్స్ జరగక, థియేటర్స్ మూతపడి.. తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. అసలు కరోనా మహమ్మారి ప్రభావాన్ని గుర్తించి తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్ట మొదట చిత్రీకరణలను ఆపేసింది కథానాయకుడు చిరంజీవి. అప్పటికి ఆయన ‘ఆచార్య’ చిత్రం సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతున్నప్పటికీ.. కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకోని తన చిత్ర షూటింగ్‌ను నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన బాటలోనే చిత్ర పరిశ్రమ మొత్తం స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించడం షురూ చేసింది.

ఇప్పుడీ లాక్‌డౌన్‌ తర్వాత తొలుత సెట్స్‌పైకి అడుగుపెట్టబోతున్న కథానాయకుడు కూడా చిరంజీవే కానున్నారట. జూన్‌ నుంచి సినిమా చిత్రీకరణలకు అనుమతులు ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పరిశ్రమలో మళ్లీ షూటింగ్‌ల సందడి షురూ కాబోతుంది. అయితే ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్లనున్న కథానాయకుల్లో తొలుత సెట్స్‌లోకి అడుగుపెట్టబోయేది చిరునే అని సమాచారం. ఆయన నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రాన్ని జూన్‌ 15 నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగా దర్శకుడు కొరటాల శివ కొత్త షెడ్యూళ్లను ఖరారు చేసుకునే పనిలో పడ్డారట. 

Leave a comment

error: Content is protected !!