ఖైదీనెంబర్ 150 చిత్రంతో కమ్ బ్యాక్ అయిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ తో మరింత జోష్ గా తన తదుపరి చిత్రాల్ని ప్రోసెస్ లో పెట్టారు. ఎర్లియర్ గా సైరా నరసింహారెడ్డితో తన క్రేజ్ ను మరింత పెంచుకొన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత మెగాస్టార్ చిరు .. పలువురు యంగ్ డైరెక్టర్స్ తో సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నారు. ఆల్రెడీ లూసిఫర్ రీమేక్ కోసం సుజిత్ ను దర్శకుడిగా సెట్ చేసుకొన్న ఆయన .. ఆ పై మెహర్ రమేశ్ తోనూ, బాబీతోనూ కూడా సినిమాలు చేయబోతున్నారు. ఇక ఇప్పుడు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా లైన్ లోకి రానుందని సమాచారం.
మెగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటూ వస్తున్నారు. సరైన అవకాశం రాక ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని టాక్. త్వరలోనే శంకర దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. ఒక మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్..కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు 2’ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా కరోనాతో పాటు అంతకు ముందు సెట్లో జరిగిన యాక్సిడెంట్ కారణంగా ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ సినిమా వీళ్లిద్దరు ఆయా ప్రాజెక్టులు పూర్తైయిన తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. ఈసినిమాను అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయి. మరి వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కోతున్న ఈసినిమా టాలీవుడ్లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.