మెగా స్టార్ తర్వాత ఆయన బాటలో సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్. అయితే వీళ్ళు సినిమాల్లోనే కాదు సినిమాల్తో పాటుగా సోషల్ మీడియాలో కూడా హంగామా చేస్తున్నారు. ఈ మెగా హీరోలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ మాములుగా ఉండదు. మెగా ఫ్యాన్స్ ఈ హీరోల్లో ఏ ఒక్కరు ట్వీట్ వేసినా లైక్స్, షేర్స్ తో హోరెత్తిస్తారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే ఫేస్ బుక్ కింగ్ అయిపోయాడు.  ఇక రామ్ చరణ్ కూడా తాజాగానే సోషల్ మీడియాలోకి వచ్చినా.. భారీ ఫాలోయింగ్ సంపాదించాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి కొన్నేళ్లు రాజకీయాల్లో బిజీగా ఉండి ఇప్పుడు అక్కడ గుడ్ బై చెప్పి మళ్ళి సినిమాలకు రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అయితే చిరు నాలుగేళ్ళ క్రితం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఇంతవరకు సోషల్ మీడియాలో కాలు పెట్టలేదు. అయితే తాజాగా చిరు ఉగాది పండుగ సందర్బంగా సోషల్ మీడియాలో అడుగు పెట్టాడు.  సోషల్ మీడియాలో ఆయన మీదున్న ఫేక్ అకౌంట్స్ కే వేలల్లో లైక్స్ వస్తున్నాయి. అలాంటి  చిరు ఆఫీసియల్ అకౌంట్  కు ఇక ఏ రేంజ్ లో లైక్స్ , ఫాలోవర్స్ ఉండాలి? ఈ ఉగాది నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ మెంబరైపోయిన చిరంజీవి.. కేవలం ఒకటిన్నర నెలల్లోనే ట్విట్టర్ అకౌంట్లో  దాదాపు 500k ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం గ్రేటే కదా మరి. దాంతో  తమ ఆరాధ్య కథానాయకుడి  అసాధారణమైన క్రేజ్ కు మురిసిపోతున్నారు మెగాభిమానులు. దటీజ్ మెగాస్టార్ ..

Leave a comment

error: Content is protected !!