Chiranjeevi : కేరళలోని వయనాడు కొద్ది రోజుల క్రితం ప్రకృతి విపత్తులకు గురై విషాదాన్ని నింపింది. అకాల వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు జిల్లాను అతలాకుతలం చేశాయి. ఈ విషాదం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. ఈ కష్టకాలంలో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముందుకొచ్చి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
వయనాడు ప్రజలకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అయితే నిన్న సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి తనే స్వయంగా కేరళకు వెళ్లి, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు కోటి రూపాయల చెక్‌ను అందజేశారు. ఈ కరుణా హస్తం వాయనాడు ప్రజలకు కొంత ఊరటనిచ్చింది. చిరంజీవి, రామ్ చరణ్‌ల దాతృత్వం అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.