చిత్రం: గాడ్ ఫాదర్
నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరీ జగన్నాధ్, సత్య దేవ్, సముద్రఖని, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
నిర్మాతలు: రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్
దర్శకత్వం : మోహన్ రాజా
విడుదల తేదీ : అక్టోబర్ 05, 2022
ఆచార్య భారీ ఫ్లాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సత్య దేవ్ విలన్ గా నటించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. భారీ అంచనాల మధ్య వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ చిత్రానికి “మోహన్ రాజా” దర్శకత్వం వహించారు. మలయాళం లో సంచలనం క్రియేట్ చేసిన “లూసిఫర్” రీమేక్ గా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ ఈ రోజు విడుదల అయింది. ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..!!
కథ: రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.అర్ హఠాత్ మరణం తరువాత, అయ్యన కుమార్తె సత్యప్రియ (నయనతార) తన భర్త జయ్ దేవ్ (సత్య దేవ్) ను ముఖ్యమంత్రి గా పార్టీ లో ప్రచురిస్తుంది. అల్లుడు జయ్ దేవ్ కూడా ముఖ్యమంత్రి పదవి దక్కాలని, దురాశ పరులతో చేతులు కలుపుతాడు. అప్పటికే, బ్రహ్మ/అబ్రహం ఖ్యురేషి (చిరంజీవి) పార్టీ లో బలమైన నేత గా ఎదుగుతాడు. జయ్ దేవ్ కి ముఖ్యమంత్రి పదవి దక్కనివ్వకుండ బ్రహ్మ ఏం చేసాడు? సత్యప్రియ (నయనతార) బ్రహ్మను ని ఎందుకు ద్వేషిస్తుంది? పి.కె.అర్ పార్టీ కి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఈ విషయాలన్ని తెలియాలంటే సినిమాని తెరపైన చూడాల్సిందే.
కథనం, విశ్లేషణ: సినిమా ఓపెనింగ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.అర్ హఠాత్ మరణం పార్టీ మొత్తాన్ని అంధకారం లో పడేస్తుంది. ఆ టైమ్ లో గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ సగటు ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఎప్పటిలాగే, ఈ సినిమాలో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా చిరంజీవి కాంబినేషన్ లో నయనతార తో మరియు దివి తో సాగే కొన్ని ఎమోషన్ సీక్వెన్స్ లు కన్నీళ్లు తెప్పిస్తాయి. అదే విధంగా, మెగాస్టార్ కి ఏ మాత్రం తీసి పోనీ విధంగా ‘సత్య దేవ్” అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. సత్య దేవ్ మాట్లాడే ప్రతి మాట తూటాల్లా అగ్రెసివ్ గా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే, సత్య దేవ్ చేసిన క్యారెక్టర్ కి ఊపిరి పోశారని చెప్పాలి.
నయనతార ముఖ్యమంత్రి కుమార్తెగా నటించి తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కొన్ని కీలకమైన దృశ్యాల్లో చాలా సటిల్డ్ గా పెర్ఫామ్ చేసింది. ఫస్ట్ ఆఫ్ లో లూకాస్ బృందం తో జరిగే ఫైట్ సీక్వెన్స్ కనువిందు గా ఉంటుంది. “దివి” ప్రీ ఇంటర్వెల్ లో బ్రహ్మ కి ఇచ్చిన ట్విస్ట్ అందరిని కలిచి వేస్తుంది. సల్మాన్ ఖాన్ ఇంటర్వెల్ లో ఇచ్చిన ఎంట్రీ బ్యాంగ్ అదిరిపోతుంది.
సెకండ్ ఆఫ్ లో “జయ్ దేవ్” వేసే ఎత్తుకు పై ఎత్తులు తిప్పి కొడతా ఉంటాడు ‘బ్రహ్మ”. ఏ కారణంతో అయ్యితే బ్రహ్మ జైల్ లో ఊసలు లెక్కపెడతాడో, అదే కారణంతో దర్జా గా బయటికి తిరిగి వస్తాడు. ప్రతి సీన్స్ లో జయ్ దేవ్ కి చెమటలు పట్టిస్తాడు. ముఖ్యంగా, జైలు లో బ్రహ్మ కి జయ్ దేవ్ కి సాగే సంభాషణ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో లక్ష్మి భూపాల్ రాసిన ప్రతి డైలాగ్ హైలైట్ గా నిలిచాయి. అతిధి పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ ఒక హనుమంతుడు లాగ వచ్చి యాక్షన్ తో అదరకొడతాడు. ప్రత్యేకంగా క్లైమాక్స్ లో బాలీవూడ్ హీరోయిన్ “వారినా హుస్సేన్” చేసిన ఐటెం సాంగ్ మాస్ ఆడియెన్స్ కి ఊపు తెస్తుంది. కాకపోతే, సినిమాలో అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ సాగదీతగా ఉండటం, క్లైమాక్స్ రొటీన్ గా సాగటం తప్ప. ఓవర్ అల్ గా, ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అని చెప్పాలి.
బాలీవూడ్ బడా హీరో అయ్యిన సల్మాన్ ఖాన్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లో బ్రహ్మ (చిరంజీవి) కలిసి సాగే ఫైట్ సీక్వెన్స్ లు ప్రతి ప్రేక్షకుడి కి ఫీస్ట్ అని చెప్పుకోవాలి. అంత అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేసారు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్.
నటి నటుల పెర్ఫామెన్స్: చిరంజీవి గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. ప్రత్యేకంగా, అయ్యన లుక్ & స్టైల్ ఫ్యాబ్ లెస్ అనే చెప్పాలి. అదే విధంగా, ఈ సినిమా కి ఊపిరి “సత్య దేవ్” పాత్ర కి జనాలు బ్రమ్మరథం పడతారు. నయనతార పాత్ర ఈ సినిమా లో చాలా సటిల్డ్ గా ఉంటుంది. ఆమె చెల్లి పాత్ర గా చేసిన తాన్య రవిచంద్రన్ యాక్టింగ్ లో బాగా రాణించారు. సముధ్రఖని చేసిన పోలీస్ పాత్ర చాలా వైలెంట్ గా ఉంటుంది. ఈ చదరంగంలో మురళీ శర్మ కీ రోల్ పోషించారు. బ్రహ్మాజీ, పూరి జగన్నాధ్ ప్రత్యేక ఆకర్షణ. సునీల్, అనసూయ, మురళి మోహన్, కూడా తమ పాత్రల్లో చక్కగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.
సాంకేతికవిభాగం: దర్శకుడు మోహన్ రాజా స్టోరీ, టేకింగ్ అద్భుతం గా తీర్చిదిద్దారు. ఎంత గానో అభిమానించే మెగా అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా చిరంజీవి గారిని తెర మీద చూపించడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు. సినిమా మధ్య మధ్య లో నజభజ అంటూ వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ థియేటర్ లో ఒక ఊపు ఊపేస్తుంది అంత బాగా ఇచ్చాడు థమన్. నీరవ్ షా సినిమాటోగ్రఫీ పని తీరు చాలా చక్కగా ఉంది. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తగ్గకుండా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది.
రేటింగ్: 3.5/5
బాటమ్ లైన్: బాక్స్ ఆఫీస్ థార్ మార్ కానున్న”గాడ్ ఫాదర్”