తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇరు కుటుంబాలలో జరిగే ఫంక్షన్ లలోను కూడా వీరు పాల్గొంటుంటారు. తాజాగా వైల్డ్‌డాగ్ సినిమా ప్రమోషన్‌లో బిజీబిజీగా గడిపేస్తున్న నాగార్జున చిరంజీవి ఇంటికి వెళ్లాడు. చిరంజీవి ఇంటికి వచ్చిన నాగార్జున కోసం స్వయంగా ఓ కమ్మని వంటను స్వయంగా తానే చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోను నాగార్జున ట్విటర్‌లో చిరంజీవితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు.
‘‘’వైల్డ్ డాగ్’ విడుదల సందర్భంగా నా ఒత్తిడి తగ్గించేందుకు మెగాస్టార్ స్వయంగా వంటచేశారు. నా కోసం రుచికరమైన విందుని ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం చాలా అద్భుతంగా గడిచింది.”’’ అంటూ… ఈ ఫోటోను తీసిన చిరంజీవి సతీమణి సురేఖ గారికి ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు నాగార్జున.
అలాగే ఫోటో తీసిన సురేఖ గారికి థ్యాంక్స్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.