రోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది. పలు దేశాల ప్రజలు దాని బారిన పడ్డారు. ఆ పెను భూతం భారత్ కూ వ్యాపించి .. ఇక్కడ ప్రజల్నీ భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో పలు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీని కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు ఇంట్లో తమ భార్యలకు పనుల్లో సహాయపడుతున్నారు. అందులో భాగంగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు రాజమౌళికి ఓ ఛాలెంజ్‌ విసిరారు. వంట సామానులు కడుగుతూ – ఇంటిని శుభ్రం చేస్తూ వీడియోను రికార్డు చేసి నిన్న ట్విట్టర్ లో షేర్ చేసి ‘బీ ద రియల్ మెన్’ అని రాజమౌళికి ఛాలెంజ్ విసిరాడు. పోస్ట్ చేశాడు. అంతేకాదు ఆయన ఎన్టీఆర్ – చరణ్ లకు #BeTheRealMan ఛాలెంజ్ విసిరాడు. దీంతో రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించిన తారక్.. తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ‘మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం’ అంటూ పోస్ట్ చేస్తూ వీడియోలో ఆయన ఇంటి ఆవరణను శుభ్రం చేయడం.. గిన్నెలు కడగడం.. ఇల్లు తుడవడం లాంటివి చేస్తున్నాడు. అంతేకాదు ఆయన ఈ సందర్భంగా టాలీవుడ్ సూపర్ సీనియర్లైన చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ – బాలయ్యల తో పాటు దర్శకుడు కొరటాల శివను ఛాలెంజ్ చేశాడు.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా జూనియర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘ఛాలెంజ్ యాక్సిప్టెడ్ తారక్.. అలాగే యువర్ పార్టనర్ చరణ్ ఇన్ క్రైమ్.. వీడియో కోసం వెయిటింగ్’ అంటూ పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా దీనికి చిరంజీవి నటించిన ‘ఛాలెంజ్’ సినిమా టైటిల్ పోస్టర్ ని జత చేసాడు. ఈ పోస్ట్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఇంట్లో పనులు చేసుకుంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి మరి ఎలాంటి ఇంటి పనులతో వీడియో వదులుతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు మిగిలిన సీనియర్ హీరోలు ఈ ఛాలెంజ్ పై ఎలా స్పందిస్తారో అని ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!