నటభూషణ శోభన్ బాబు నటించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ చిత్రం ‘చేసినబాసలు. శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్ పై సుందర్ లాల్ నహతా సమర్పణలో కె.యస్.ఆర్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1980లో విడుదలైంది. సరిగ్గా 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఘన విజయం సాధించింది. జయప్రద కథానాయికగా నటించగా.. మురళీమోహన్, ప్రసాద్ బాబు, మిక్కిలినేని, కె.వి.చలం, బాలకృష్ణ (హాస్యనటుడు), మాధవి, జయమాలిని ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఎంతో సఖ్యతగా ఉన్న ఇద్దరు అన్నదమ్మల మధ్య అనుమానాలు, అపార్ధాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇద్దరిలో ఒకరు గ్యాంగ్ స్టర్ అవడంతో వారిద్దరి జీవితాల్లో కొన్ని అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇందులో అన్నదమ్ములుగా శోభన్ బాబు, మురళీమోహన్ నటించారు.    సత్యం సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన కె.యస్.ఆర్ పలు కుటుంబ కథాచిత్రాలు కూడా తెరకెక్కించారు. అందులో చేసినబాసలు చిత్రం ఒకటి.

Leave a comment

error: Content is protected !!